కవల పిల్లలు( Twins ) జన్మిచడం మనం చూస్తూనే ఉంటాం.చాలామందికి ఇటీవల కవల పిల్లలు పుడుతున్నారు.
ట్విన్స్ బేబీలు చూడటానికి ఒకేలా ఉంటారు.వారి మొఖం ఒకేలా ఉంటుంది.
దీంతో గుర్తు పట్టడం కూడా కష్టంగా ఉంటుంది.అయితే కవలలు జన్మించడానికి అనేక కారణాలు ఉంటాయి.
వైద్యులు అనేక కారణాలను చెబుతూ ఉంటారు.అయితే కవలలు జన్మించడానికి మరో కారణం కూడా ఉందట.
భారత నటి సెలీనా జైట్లీ( Celina Jaitly ) రెండుసార్లు కవలలకు జన్మనిచ్చింది.తొలిసారి ఇద్దరు మగ పిల్లలు జన్మించగా… మళ్లీ అలాగే కవలలు పుట్టారు.వీరిలో ఒకరు గుండె జబ్బు కారణంగా మరణించారు.అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సెలీనా ముచ్చటించింది.
ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.ఈ సందర్భంగా ఒక నెటిజన్ మీకు కవలలు పుట్టడానికి కారణం ఏంటని ప్రశ్నించాడు.
దీనికి సెలీనా జైట్లీ సమాధానమిచ్చింది.

తాను అరుదైన జన్యుపరమైన పరిస్థితి వల్ల కవలలకు జన్మనిచ్చినట్లు చెప్పుకొచ్చింది.వారసత్వంగా వచ్చిన ఆరోగ్య పరిస్థితి వల్ల రెండుసార్లు కవలలు పుట్టినట్లు తెలిపింది.ఈ జన్యుపరమైన సమస్య వల్ల ఎన్నిసార్లు గర్భం దాల్చినా కలలలే పుడతారట.
ఈ జన్యుపరమైన సమస్య( Genetics Disorder ) వల్ల అండోత్సర్గము జరిగే సమయంలో ఒకటి కంటే ఎక్కడ అండాలు విడుదల అవుతాయి.దీని వల్ల కవలలు జన్మిస్తారు.

సెలీనా 2012లో ఒకే కాన్పులో ఇద్దరు మగపిల్లలకు జన్మనివ్వగా.2017లో కూడా మగ కవల పిల్లలు పుట్టారు.ఒకే అండంతో రెండు వీర్యకణాలు కలిసినప్పుడు అది రెండు పిండాలుగా విడిపోయి అభివృద్ధి చెందుతుంది.ఇలాంటి సమయంలో పుట్టే పిల్లలు ఒకే జెండర్ కు కలిగినవారు ఉంటారు.
ఇద్దరు ఆడపిల్లలు లేదా మగపిల్లలు జన్మనిచ్చారు.అలాగే రెండు అండాలు రెండు వీర్యకణాలు కలిస్తే ఒక మగ, మరొకరు ఆడ జెండర్ జన్మిస్తారు.