కొన్ని వింత ఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.ప్రకృతి విరుద్దంగా జరిగే ఘటనలు మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఉంటాయి.
ఇలాంటి వింత ఘటనలు రోజూ ప్రపంచంలో ఎన్నో చోటుచేసుకుంటూ ఉంటాయి.కానీ బయటపడేది మాత్రం కొన్ని మాత్రమే.
ఆశ్చర్యాన్ని కలిగించే ఘటనలను చూసినప్పుడు ఇదెలా సాధ్యం అని మనం అనుకుంటూ ఉంటాము.
మాములుగా సింహాలు( Lions ) మాంసాహార జంతువులు.
శాకాహారాన్ని అవి అసలు తీసుకోవు.ఇతర జంతువులను వేటాడి వేటాడి వాటిని చంపేసి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి.
సింహం ముందు ఏ జంతువు కనిపించినా అది ఇక మాటాషే.జంతువులను వేటాడి తినేసే సింహం.
గడ్డి, ఆకులను( Grass ) తినడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఒక సింహం గడ్డి, ఆకులను తింటూ కనిపించింది.పచ్చటి గడ్డి ఆకులను మేస్తూ ఉంది.
ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు.ఈ వీడియోలో మేకలు, గొర్రెల తరహాలో సింహం గడ్డిని తింటూ ఉంది.ఈ వీడియోను షేర్ చేసి సుశాంత నంద.సింహాలు గడ్డి, ఆకులను తినడానికి ఒక రీజన్ ఉందని చెప్పారు.వాటిని తినడం వల్ల సింహాలకు కడుపునొప్పి తగ్గుతుందని చెప్పారు.మీకు షాకింగ్ అనిపించినా ఇది నిజమని అన్నారు.
ఆయన షేర్ చేసిన వీడియో 44 సెకన్లు ఉండగా.లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.పిల్లులు, కుక్కలు కూడా గడ్డి తింటాయని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.ఇలా నెటిజన్లు అనేక విధాలుగా కామెంట్లు పెడుతున్నారు.అడవికి రాజు అయిన సింహాం ఇలా గడ్డిని తినడం వింతగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.ఇలాంటివి కామన్ గా జరుగుతూ ఉంటాయని మరికొందరు అంటున్నారు.