టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan )సాయి ధరమ్ తేజ్( Sai dharam tej )కలిసి నటించిన తాజా చిత్రం బ్రో.సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.కాగా ఈ సినిమా జూలై 28న విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది.విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మూవీ మేకర్స్ విలేకర్లతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా విలేకరులతో కేతికా శర్మ( Ketika sharma ) మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఈ సినిమాను ఒప్పుకోవడానికి కారణం ఏంటి అని విలేకర్ ప్రశ్నించగా.పవన్ కళ్యాణ్ అంటూ వెంటనే సమాధానం ఇచ్చింది కేతికా శర్మ.
ఆయన పేరు వింటే చాలు.సినిమా ఒప్పుకోవడానికి పెద్దగా కారణాలు అక్కర్లేదు.
పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో నాకు సన్నివేశాలు లేవు.కానీ ఆయనతో కలిసి సినిమాలో పనిచేయడం సంతోషంగా ఉంది.
పవన్ కళ్యాణ్ గారిని అంతకముందు ఎప్పుడూ కలవలేదు.మొదటిసారి ఈ సినిమా ద్వారానే ఆయనను కలిసే అవకాశం లభించింది అని సంతోషంగా చెప్పుకొచ్చింది కేతికా శర్మ.

ఇందులో ఆమె మార్క్ అనే పాత్రకు ప్రేయసిగా కనిపించబోతున్నట్లు తెలిపింది.అలాగే ఈ మూవీ ఒక సందేశాత్మక చిత్రమని ఈ తరహా సినిమాలో నటించే అవకాశం రావడం తనకు ఇదే మొదటిసారి అని స్పష్టం చేసింది.తన గత చిత్రాలతో పోలిస్తే ఇది విభిన్నంగా ఉంటుందని అన్నారు.నటిగా మరింత మెరుగుపడటానికి తనకు సహాయపడిందని ఆమె తెలిపారు.ఇకపోతే కేతికా శర్మ నటించిన సినిమాల విషయానికొస్తే.ఈమె గత ఏడాది రంగరంగ వైభవంగా సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన నటించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు వైష్ణవ్ తేజ అన్నయ్య సాయిధరమ్ తేజ్ తో కలసి రొమాన్స్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది ఈ బ్యూటీ.ఇలా అన్నదమ్ములతో కలిసి నటించడం అన్నది యాదృచ్ఛికంగా జరిగిందని ఆమె తెలిపింది.