Rashmika Mandanna: సీక్రెట్ గా ఆ పని చేసిన రష్మిక మందన్న.. మరిదిపై ప్రేమ మామూలుగా లేదుగా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న( Rashmika Mandanna ) ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ బ్యూటీ పేరు బాగా హాట్ టాపిక్ గా మారింది.

 Rashmika Mandanna Did That Secretly And Love Is Not Normal-TeluguStop.com

అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న రష్మిక.ప్రస్తుతం స్టార్ హీరోల సరసన పాన్ ఇండియా లెవెల్ లో దూసుకెళ్తుంది.

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది ఈ కన్నడ బ్యూటీ.తర్వాత విజయ్ దేవరకొండతో(Vijay Devearkonda) చేసిన గీతగోవిందం, మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో చేసిన భీష్మ సినిమాలు చేసి స్టార్ హోదాకు చేరుకుంది.

అలా వరుసగా మంచి మంచి సక్సెస్ లు అందుకోగా ఇప్పుడు ఎవరికి అందనంత లెవెల్ లో దూసుకెళ్తుంది.ఇక ఏడాది కిందట అల్లు అర్జున్(Allu Arjun) తో కలిసి పుష్ప సినిమాలో నటించగా ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది.

Telugu Baby, Rashmika-Latest News - Telugu

పైగా బాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా వరుస ఆఫర్స్ రావటంతో అక్కడ కూడా చాలా బిజీగా మారింది.దీంతో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ గా మారింది.ఇక త్వరలో పుష్ప 2తో ప్రేక్షకుల ముందుకు రానుంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.ప్రతిరోజు ఫోటోషూట్లు చేయించుకుంటూ వెంటనే వాటిని నెట్టింట్లో పెట్టి బాగా రచ్చ చేస్తుంది.అప్పుడప్పుడు సినిమాకు బ్రేక్ దొరికితే చాలు బయట దేశాలలో తిరుగుతూ హల్చల్ చేస్తుంది.

ఇక మొత్తానికి ఈ బ్యూటీ కి ఇప్పుడు బాగా కలిసి వచ్చింది.కొత్త హీరోయిన్స్ ఎంత మంది వచ్చినా కూడా ఈ బ్యూటీని మాత్రం అసలు వదలట్లేదు దర్శకనిర్మాతలు.

ఇక ధైర్యం చూసుకునే రష్మిక రోజురోజుకి మరింత పరుగులు తీస్తుంది.

Telugu Baby, Rashmika-Latest News - Telugu

ఇక అప్పుడప్పుడు వ్యక్తిగత విషయంలో కూడా బాగా హాట్ టాపిక్ గా మారుతుంది.ముఖ్యంగా తను విజయ్ దేవరకొండ తో(Vijay Devearkonda) ప్రేమలో ఉందని కొన్ని రోజుల నుండి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.కానీ ఆ మధ్య వీరిద్దరూ విడిపోయారు అని మళ్లీ వార్తలు వచ్చాయి.

అయితే ఇదంతా పక్కన పెడితే.విజయ్ దేవరకొండ తో ఉన్న పరిచయం వల్ల వారి ఫ్యామిలీతో కూడా రష్మిక క్లోజ్ గా ఉంటుంది.

Telugu Baby, Rashmika-Latest News - Telugu

అయితే ఈ సందర్భంగా తన మరిది ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా కూడా రిలీజ్ అబటంతో ఆ సినిమా చూడటానికి సీక్రెట్ గా ముసుగు వేసుకొని సినిమాకు వెళ్ళినట్టు తెలిసింది.ప్రీమియర్ చూడడానికి రష్మిక సీక్రెట్ గా థియేటర్ కి వచ్చిన క్లిప్స్ బాగా వైరల్ గా మారాయి.బ్లూ జీన్స్.వైట్ టీ షర్ట్.బ్లాక్ క్యాప్ ఫేస్ కి మాస్క్ పెట్టుకుంది.దీంతో మరిది మీద వదినకు ప్రేమ మామలుగా లేదుగా అని కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube