ప్రముఖ భారత కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్( Tata Motors ) ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలను అద్భుతమైన ఫీచర్లతో విడుదల చేస్తూనే ఉంది.తాజాగా అడ్వాన్స్డ్ ఫీచర్లతో హరియర్ మోడల్ ను ఎలక్ట్రిక్ SUV గా మార్చాలని నిర్ణయించుకుంది.
ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ హరియర్ SUV ను ( Tata HARRIER EV ) డెవలప్ చేసే విషయాన్ని కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది.కస్టమర్ల అవగాహన కోసం కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన ఒక ఫోటోను విడుదల చేసింది.
ప్రస్తుతం వాహన ప్రియులకు ఈ హరియార్ ఎలక్ట్రిక్ కార్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంది.
కంపెనీ విడుదల చేసిన కారు ఫోటోను చూసిన వారంతా డ్యూయల్ టోన్ బ్రాంజ్, వైట్ కలర్ స్కీమ్ లో కారు అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.కారు ముందు భాగాన్ని చూస్తే SUV ఫ్రెష్ స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ కాన్ఫిగరరేషన్, ఫుల్ విడ్త్ తో LED బార్, వైట్ లేదా క్రోమ్ లో ఫినిష్ చేసిన గ్రిల్ ఉంది.
కంపెనీ ఈ హరియర్ ఎలక్ట్రిక్ కారు( Tata Harrier EV )కు సంబంధించిన స్పెసిఫికేషన్లను పెద్దగా వెల్లడించలేదు.కానీ కారుకు సంబంధించి కొన్ని వివరాలను మాత్రమే తెలిపింది.ఈ కారు డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ తో వస్తుందని క్లారిటీ ఇచ్చింది.
ఈ కారు ఒకసారి చార్జింగ్ చేస్తే సుమారుగా 500 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేయనుంది అని సమాచారం.దీని బ్యాటరీ కెపాసిటీ 60kwh గా ఉండే అవకాశం ఉంది.
ఈ కారు వెహికల్-టు-లోడ్ (V2L), వెహికల్-టు-వెహికల్ (V2V) సామర్ధ్యాలతో వస్తుందని కంపెనీ తెలిపింది.ఈ కారు సొంత బ్యాటరీని చార్జ్ చేయడమే కాకుండా ఇతర వాహనాలను కూడా చార్జ్ చేస్తుంది.
ఇది అడ్వాన్స్డ్ వెహికల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టంతో వస్తుంది.ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.30 లక్షల నుండి రూ.31 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.త్వరలోనే భారత మార్కెట్లోకి విడుదల అవ్వనుంది.