కింగ్ కోబ్రా… ( King Cobra ) ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషసర్పంగా పేరుగాంచిన పాము.ఇది అన్ని పాములకంటే కూడా చాలా పొడవుగా ఉంటుంది.
ఈ కింగ్‌కోబ్రా 12 అడుగుల నుండి 20 అడుగుల వరకు పెద్ద పరిమాణంతో పెరగగలదు.కింగ్ కోబ్రా శాస్త్రీయనామం ఓఫియోఫాగస్ హన్నా.
ఆసియాకు చెందిన ఈ విషపూరిత పాము నలుపు రంగు కలిగి ఉండి తెల్లటి చారలను పులుముకొని ఉంటుంది.కొన్ని గోధుమ బూడిద రంగులో కూడా ప్రత్యక్షమౌతాయి.
కింగ్ కోబ్రా దక్షిణం నుండి ఆగ్నేయాసియా అడవుల వరకు అన్ని చోట్లా మనకు కనిపిస్తుంది.అది సాధారణంగా ఇతర జాతుల పాములను వేటాడుతుంది.
ఒక ఆడ కింగ్ కోబ్రా తన గుడ్లను పెట్టడం కోసం ఒక గూడును నిర్మిస్తుంది.

అసలు విషయంలోకి వెళితే, బిహార్లోని( Bihar ) చంపాపూర్ జిల్లాకు చెందిన నితీష్ కుమార్( Nitish Kumar ) తన ఇంట్లోకి పొడవాటి పాము రావడాన్ని గమనించాడు.ఆ తరువాత దానిని రెచ్చగొట్టగొట్టకుండా అతను రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దానిని పట్టుకున్నారు.ఈ సందర్భంగా నితీష్ మాట్లాడుతూ… తాను నీళ్లు తాగబోతుండగా ఓ మూలన పొడవాటి పాము ఉండడం గమనించానని తెలిపాడు.
ఆ వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించానని, కొద్ది నిమిషాల్లోనే నలుగురు అటవీ అధికారులు వచ్చి ఆ పాముని తీసుకెళ్లినట్టు చెప్పాడు.ఈ కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి స్నేక్ హ్యాండ్లర్లకు 30 నిమిషాల సమయం పట్టిందని కూడా తెలిపాడు.

ఇక అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.వానాకాలం సీజన్లో వర్షం కురిసిన తర్వాత పాములు వాటి బొరియల నుంచి బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు.ఎందుకంటే, బొరియలు నీటితో నిండిన తర్వాత అవి సురక్షితమైన స్థలాన్ని వెతుకుతూ అలా బయటకు వస్తాయన్నమాట.వాస్తవానికి భారతదేశానికి చెందిన కింగ్ కోబ్రా ఇప్పుడు ఆసియాలో మాత్రమే దర్శనం ఇస్తోంది.
జాతుల రూపాన్ని దాని పర్యావరణాన్ని బట్టి నలుపు, తెలుపు చారల నుండి ఏకరీతి గోధుమ బూడిద రంగులోకి మారుతుందని అటవీ అధికారులు వివరించారు.