ముగిసిన మహిళా టి 20 క్రికెట్ పోటీలు..విజేత గా మహారాష్ట్ర టీమ్

ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్ధార్ పటేల్ స్టేడియంలో గత వారం రోజులుగా అంతర్జాతీయ స్థాయిని తలపించే విధంగా జాతీయస్థాయి మహిళ టి20 క్రికెట్ టోర్నమెంట్స్ కన్నుల పండుగగా సాగింది.ఓవైపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ, భానుడి ఉగ్రరూపం కనిష్టస్తాయికి వచ్చినఅనంతరం సాయంత్రం పూట ఫ్లడ్ లైట్ల వెలుతురులో డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్లను నిర్వాహకులు యువమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ కూరపాటి ప్రదీప్ పర్యవేక్షణలో టి20 మహిళా క్రికెట్ పోటీలు ఆహ్లాదభరిత వాతావరణంలో మంగళవారం క్రికెట్ పోటీలు ముగిశాయి.

 Women's T20 Cricket Competition Is Over..maharashtra Team Is The Winner-TeluguStop.com

ప్రథమ స్థానంలో మహారాష్ట్ర జట్టు( Maharashtra ) విజయం సాధించగా ద్వితీయ స్థానంలో ఉత్తరఖాoడ్ జట్టు నిలిచింది.

ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి ప్రదీప్( kurapati-pradeep ) మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి మహిళా టి20 క్రికెట్ పోటీల నిర్వహనే తన లక్ష్యమన్నారు.

కోవిడ్ కు ముందు కోవిడ్ తర్వాత కూడా బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశాలకు చెందిన మహిళ క్రీడాకారులు గతంలో ఖమ్మం గడ్డపైన ఆడిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు.రాబోవురోజుల్లో అంతర్జాతీయ స్థాయి మహిళా టీ 20 క్రికెట్ పోటీలను నిర్వహించి భారత కీర్తి పతాకాన్ని తెలంగాణలోని ఖమ్మం జిల్లా గడ్డపై ఎగరవేయాలనేదే తన అభిలాశా అని పేర్కొన్నారు.

ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన DSDO పరంధామరెడ్డి, కార్ ఇన్ షోరూమ్ అధినేత మహమ్మద్ అజీమ్, కోచ్ మతీన్, సహాయకులు సాంబమూర్తిలకు డాక్టర్ కూరపాటి కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube