సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) జీవితం తెరిచిన పుస్తకం అనే సంగతి తెలిసిందే.ఆయన జీవితంలో ఎన్నో విశేషాలున్నాయి.
ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగిన వాళ్ల సంఖ్య తక్కువేం కాదు.ఎన్టీఆర్ తనను నమ్మిన వాళ్లకు కెరీర్ పరంగా తన వంతు సహాయాలు చేశారు.
ఆయన గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఆయనతో సినిమాలు చేసిన వాళ్లు చెబుతారనే సంగతి తెలిసిందే.
ఎక్స్ ఐపీఎస్ నరసయ్య( Ex IPS Narsaiah ) ఒక ఇంటర్వ్యూలో సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సీనియర్ ఎన్టీఆర్ కు ఒకరోజు శ్రీశైలంలో ( Srisailam ) ప్రోగ్రామ్ ఉందని 6 గంటల తర్వాత హెలికాఫ్టర్ దాటకూడదని నిబంధనలు ఉన్నాయని ఆయన తెలిపారు.ఆరున్నరకు హెలికాఫ్టర్ ఎక్కగా ఏమీ కనిపించడం లేదని నరసయ్య అన్నారు.1000 అడుగుల పైన తీసుకెళ్లాలని ఎక్కడ ఎక్కువ లైట్లు కనబడితే అది హైదరాబాద్ అనుకోవాలని ఎన్టీఆర్ చెప్పారని ఆయన కామెంట్లు చేశారు.

7 గంటల 45 నిమిషాలకు ఛార్మినార్ కనబడిందని అయితే ఆ పైలెట్ కు మెమో ఇచ్చారని నరసయ్య తెలిపారు.మదనపల్లి పక్కన్న ఉన్న శాంతిపురంలో ఎనిమిది గంటలకు ఎన్టీఆర్ కు మీటింగ్ ఉందని అక్కడ ఫుల్ క్రౌడ్ ఉందని నరసయ్య చెప్పుకొచ్చారు.రిటర్న్ అయ్యే సమయంలో ఎన్టీఆర్ మేచేయి హెలికాఫ్టర్ కొక్కానికి తగిలిందని ఆయన కామెంట్లు చేశారు.
డోర్ కొక్కెం బయటకు వచ్చి ఎన్టీఆర్ కింద పడేవారని నేను ఆయనను పట్టుకొని లాగానని నరసయ్య వెల్లడించారు.

మేము పంజాబ్ కు వెళ్లిన సమయంలో ఎన్టీఆర్ ముందుగానే వెళ్లిపోగా లూథియానాకు వెళ్లమంటే మరో ప్లేస్ కు డ్రైవర్ తీసుకెళ్లాడని ఆయన అన్నారు.అక్కడ పోలీసుల సహకారం తీసుకుని విమానాశ్రయంకు వెళ్లామని నరసయ్య అన్నారు.నేను రాలేదని చెప్పి ఫ్లైట్ ఆపాలని ఆ సమయంలో ఎన్టీఆర్ అధికారులతో గొడవ పడ్డారని ఆయన చెప్పుకొచ్చారు.







