ప్లే ఆఫ్ షెడ్యూల్ ఖరారు.. ఎలిమినేటర్ మ్యాచ్ ఏజట్ల మధ్య అంటే..!

ఐపీఎల్( IPL ) సీజన్ లో లీగ్ మ్యాచ్లో పూర్తయ్యాయి.గుజరాత్, చెన్నై, లక్నో, ముంబై( GT< CSK< LSG< MI ) జట్లు ప్లే ఆఫ్( Playoffs ) చేరాయి.

 Playoffs Schedule Finalized Eliminator Match Between Teams Means Details, Ipl La-TeluguStop.com

చివరి బెర్త్ కోసం బెంగుళూరు, ముంబై జట్లు పోటీ పడడంతో తాజాగా జరిగిన రెండు మ్యాచ్లు చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగాయి.గుజరాత్ చేతిలో బెంగుళూరు ఓడి ఇంటి ముఖం పట్టింది.

హైదరాబాదును ఓడించి ముంబై జట్టు ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది.

క్వాలిఫయర్ 1( Qualifier 1 ) మ్యాచ్ చెపాక్ వేదికగా మే 23న రాత్రి 7:30 గంటలకు చెన్నై- గుజరాత్ మధ్య జరగనుంది.

ఎలిమినేటర్( Eliminator ) మ్యాచ్ ముంబై- లక్నో మధ్య జరగనుంది.మే 24న రాత్రి 7:30 గంటలకు చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

క్వాలిఫయర్ 2 మ్యాచ్ క్వాలి ఫయర్ 1 లో ఓడిన జట్టు కు ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టుకు మధ్య మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ మే 26న 7:30 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగనుంది.

ఈ ఐపీఎల్ సీజన్-16 ఫైనల్ మ్యాచ్ క్వాలిఫయర్ 1 విజేతకు క్వాలిఫయర్ 2 విజేతకు మే 28న 7:30 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనుంది.

ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకున్న నాలుగు జట్లు ఈ ఐపీఎల్ సీజన్ విజేతగా నిలవాలని కోరుకుంటున్నాయి.ఇప్పటివరకు సాగిన ఈ సీజన్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది.ఇక ఫైనల్ మ్యాచ్ కు ఏ జట్లు క్వాలిఫై అవుతాయో చూడాల్సి ఉంది.లీగ్ పాయింట్ల పట్టికలో టాప్ వన్ లో ఉన్న గుజరాత్ జట్టును గిల్ ఫైనల్ కు తీసుకెళ్తాడా.? కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని చెన్నైకు ఐపీఎల్ ట్రోపీ తెస్తాడా.? అనే విషయంపై సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube