ఏపీలో కాంగ్రెస్( Congress ) ప్రస్తావన వస్తే 2014 కంటే ముందు 2014 తరువాత అనీ చెప్పుకోవాలి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత హస్తం పార్టీ తెలంగాణలో కాస్త బలంగానే ఉన్నప్పటికి ఏపీలో మాత్రం ఆనవాలు లేకుండా పోయింది.
రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడదీసిందనే భావనతో ప్రజలు ఆ పార్టీని కూకటివెళ్లతో సహ పెకలించి వేశారు.ఒకప్పుడు ఏపీలో బలమైన పార్టీ గా ఉన్న కాంగ్రెస్.ఇప్పుడు ఆ పార్టీ ఉందనే విషయం కూడా చాలమంది మరచిపోయారు.2014 లో విభజన పరిణామాలతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా వైసీపీ వైపు మళ్లడం, నేతలు కూడా వైసీపీ గూటికి చేరడంతో ఆ పార్టీ ఏపీలో ఖాళీ అవుతూ వచ్చింది.

అలాంటి హస్తం పార్టీ మళ్ళీ ఏపీలో పువవైభవం పొందగలుగుతుందా అంటే అసాధ్యం అనే మాటనే ఎక్కువగా వినిపిస్తోంది.అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కర్నాటక ఎన్నికల్లో( Karnataka elections ) గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలపై గట్టిగా ఫోకస్ పెట్టింది.ప్రస్తుతం మరో ఆరు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు ఉండడంతో ముందు తెలంగాణ ఆ తరువాత ఏపీ అనే రీతిలో అధిష్టానం ఉందట.
ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో ఉంది.ఘర్ వాపసి తో పార్టీ వదిలి వెళ్ళిన నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించడం, తెలంగాణ ప్రజల దృష్టి బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు మళ్లించడం వంటి వ్యూహాలపై రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ( Rahul Gandhi )స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు తెలంగాణలో విస్తృత పర్యటనలు చేసే అవకాశం ఉంది.అన్నీ అనుకున్నట్లు జరిగి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే.ఏపీలో పార్టీ బలపడడం పెద్ద కష్టమేమీ కాదనేది హైకమాండ్ భావన.అయితే ఏపీలో పార్టీ ఎలాంటి వ్యూహరచనతో ముందు సాగుతుందనేదే ఇప్పుడు ఆసక్తికరం.ఎందుకంటే ఏపీ వైసీపీ, టిడిపి, జనసేన పార్టీలు బలంగా ఉన్నాయి.ఈ పార్టీలను ఢీ కొట్టి నిలిచే సామర్థ్యం ప్రస్తుతం పార్టీకి లేదు.
దాంతో మూడు పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులేయ్యాలని అధిష్టానం భావిస్తోంది.అందుకోసం బలమైన నాయకులను తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
గతంలో కాంగ్రెస్ వీడి వైసీపీలో చేరిన వారిని తిరిగి కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి అవసరం ఉంది.ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గిడుగు రాద్రరాజు కొనసాగుతున్నారు.
ఈయన పార్టీపరంగా పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు.దాంతో ముందు సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు కసరత్తు చేస్తోంది.
మరి ఏపీ విషయం కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతుందో చూడాలి.