'కస్టడీ' కోసం సామ్‌ ని వాడేస్తున్న నాగ చైతన్య?

నాగచైతన్య ( Naga Chaitanya ) హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ చిత్రం( Custody Movie ) ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నాగచైతన్య ఈ మధ్య వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో నాగ చైతన్య పదే పదే సమంత ( Samantha ) గురించిన టాపిక్ వచ్చే విధంగా ప్లాన్ చేసినట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 Naga Chaitanya Using Samantha Name For His Custody Movie Promotions Details, Nag-TeluguStop.com

గతంలో సమంత పేరు వస్తే పట్టించుకోని నాగచైతన్య ఇప్పుడు మాత్రం పదేపదే సమంత పేరు వచ్చిన కూడా స్పందిస్తున్నాడు.అలాగే సమంత పేరును తానే స్వయంగా తీస్తున్నాడు.

అందుకు కారణం ఏంటి అంటూ కొందరు ఆసక్తిని కనబరుచుతూ ఉన్నారు.

ఈ సమయంలో నాగ చైతన్య తన సినిమా కస్టడీ ప్రమోషన్ కోసం సమంత పేరును వినియోగించుకుంటున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల శాకుంతలం సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగచైతన్య పై సమంత కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.తమ వివాహ బంధం విచ్ఛిన్నం అవ్వడానికి తాను కారణం కానే కాదు అంటూ చెప్పేందుకు ప్రయత్నించింది.

ఆ విధంగా నాగచైతన్య సమంత ఆ సమయంలో వార్తలు నిలిచారు.

Telugu Krithy Shetty, Naga Chaitanya, Nagachaitanya, Samantha, Shaakuntalam-Movi

దాంతో శాకుంతలం సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది.అందుకే సమంత వినియోగించిన పబ్లిసిటీ స్టంట్ ని నాగచైతన్య ఉపయోగిస్తున్నాడు అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.సమంత చేసినట్లుగానే ఈ మధ్య ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఏదో ఒక క్వశ్చన్‌ లేదా టాపిక్ సందర్భంగా సమంత పేరును నాగచైతన్య తీసుకుంటున్నాడు.

తద్వారా కస్టడీ సినిమా గురించి మీడియాలో ఎక్కువగా వార్తలు వస్తున్నాయి.

Telugu Krithy Shetty, Naga Chaitanya, Nagachaitanya, Samantha, Shaakuntalam-Movi

ఇది సినిమా ఓపెనింగ్స్ పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నాగ చైతన్య మరియు సమంత ఇద్దరు కూడా విడిపోయిన తర్వాత ఎవరికి వారే అన్నట్లుగా సింగిల్ గానే లైఫ్ ని లీడ్‌ చేస్తున్నారు.ఈ సమయంలో వీరిద్దరి మధ్య ఇలాంటి టాపిక్స్ రావడం అది కూడా సినిమా ప్రమోషన్ కోసం ఇలా జరగడం ఏమాత్రం సభకు కాదు అంటూ వీరిద్దరినీ కామన్ గా అభిమానించే వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube