ప్రస్తుతం సోషల్ మీడియాలో కోహ్లీ- గంభీర్( Virat Kohli ) మధ్య జరిగిన వివాదంపై చర్చ నడుస్తోంది.గొడవ ఎందుకు స్టార్ట్ అయింది.? వారి మధ్య ఏం సంభాషణ నడిచింది అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.సోషల్ మీడియా వేదికగా మీ వాళ్ళదే తప్పు అంటే కాదు మీ వాళ్ళదే తప్పు అంటూ ఇరువురి ఆటగాళ్ల అభిమానుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
లక్నో- బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో వివాదానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.అయితే మ్యాచ్ అనంతరం ఇరుజట్ల ప్లేయర్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్న తర్వాత కేల్ మేయర్స్( Kyle Mayers ), విరాట్ కోహ్లీతో నువ్వెందుకు ప్రతిసారి మమ్మల్ని నిందిస్తూఉంటావ్ అని ప్రశ్నించగా.నువ్వెందుకు నన్ను కోపంగా చూస్తున్నావ్ అని కోహ్లీ తిరిగి ప్రశ్నించాడు.
చిన్నగా వీరిమధ్య చర్చ మొదలవుతున్న సందర్భంలో గౌతం గంభీర్ వచ్చి మేయర్ ను పక్కకు తీసుకెళ్తూ.అతనితో ఏం మాట్లాడుతున్నావని కోహ్లీని ప్రశ్నించాడు.అతనిని నేనేమీ అనలేదు మధ్యలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావని కోహ్లీ బదులు ఇచ్చాడు.
అప్పుడు గంభీర్ ( Gautam Gambhi )మా టీం సభ్యులు నాకు ఫ్యామిలీతో సమానం నువ్వు మా జట్టును తిడితే నా కుటుంబాన్ని తిట్టినట్టే అని కోహ్లీకి చెప్పాడు.ఆ మాటలకు మీ కుటుంబ సభ్యులను అదుపులో పెట్టుకో అంటూ విరాట్ కోహ్లీ ఘాటుగా స్పందించాడు.ఈ మాటలతో సహనం కోల్పోయిన గంభీర్.నీ దగ్గరే నేను నేర్చుకోవాలి అని కాస్త గట్టిగానే బదులిచ్చాడు.దీంతో ఇరుజట్ల సభ్యులు గొడవ ముదరకుండా ఇద్దరినీ పక్కకు తీసుకెళ్లారు.ఈ వివాదం గురించి లక్నో జట్టులోని ఓ ఆటగాడు పీటీఐ కు వివరించాడు.