ప్రస్తుతం భారతదేశంలో ఎండాకాలం ( summer season )కొనసాగుతోంది.ఈ కాలంలో స్మార్ట్‌ఫోన్‌లోని బ్యాటరీ వేడెక్కడం( Battery overheating ) సర్వసాధారణం.
ఫోన్ బ్యాటరీ మరీ హీట్ అవుతే ప్రమాదం లేకపోలేదు.అందుకే స్మార్ట్‌ఫోన్ వేడెక్కడాన్ని నివారించడానికి, ఫోన్ బ్యాటరీ 30% కంటే తక్కువగా పడిపోయినప్పుడు ఛార్జ్ చేయాలని.100% తాకినప్పుడు ఛార్జ్‌ను తీసివేయమని నిపుణులు సలహా ఇస్తున్నారు.ఫోన్‌ను 100%కి స్థిరంగా ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గుతుందని, వేడెక్కడానికి దారితీయవచ్చని కూడా చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలతో పాటు ఉపయోగించని యాప్‌లను క్లోజ్ చేయాలి.ఇలా చేయడం వల్ల ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు, వేడెక్కడాన్ని ఆపు చేయవచ్చు.ఎయిర్‌ప్లేన్ మోడ్ ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్‌లు, టెక్స్ట్ మెసేజ్( Airplane mode incoming, outgoing calls, text message )లను నిరోధించడానికి ఉపయోగపడుతుంది.ముఖ్యంగా వినియోగదారు ఎక్కువ గంటలు ఆరుబయట ఉన్నప్పుడు ఈ మోడ్ ఆన్ చేస్తే ఫోన్ వేడెక్కడాన్ని నిరోధించవచ్చు.
ఎక్కువ గంటలు గేమింగ్ యాక్టివిటీస్‌లో నిమగ్నమవ్వడం వల్ల ఫోన్ బాగా వేడెక్కుతుంది, కాబట్టి ఎక్కువ సేపు ఫోన్‌లో గేమ్‌లు ఆడకుండా ఉండటం మంచిది.
మధ్యాహ్నమంతా నేరుగా సూర్యకాంతిలో ఫోన్‌ను ఉంచడం వల్ల కూడా నష్టం జరగవచ్చు.కాబట్టి అలా చేయకూడదు.ఈ జాగ్రత్తలు స్మార్ట్‌ఫోన్ వేడెక్కడం, ఇతర ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
వేడెక్కడం వల్ల బ్యాటరీ మాత్రమే కాకుండా ఫోన్ అంతర్గత భాగాలు కూడా దెబ్బతింటాయి, దీని వల్ల పనితీరు తగ్గుతుంది, ఫోన్ జీవితకాలం తగ్గిపోతుంది.అలానే ప్రమాదాలు సంభవించవచ్చు.
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ప్రత్యేకించి ఎక్కువసేపు వాడేటప్పుడు లేదా ఛార్జింగ్ చేస్తున్నప్పుడు వేడిని పెంచకుండా నిరోధించే ఫోన్ ప్రొటెక్షన్ కేసులను ఉపయోగించడాన్ని కూడా పరిగణించవచ్చు.ఫోన్‌ను చల్లని, బాగా వెంటిలేషన్ ఉన్న వాతావరణంలో ఉపయోగించాలి, ఒకేసారి అనేక యాప్‌లను రన్ చేయడాన్ని నివారించాలి.
కాచీ మెమరీని క్రమం తప్పకుండా క్లియర్ చేయాలి.