Siddharth Aditi: సిద్ధార్థ్, అదితి లది ప్రేమ కాదా.. మరి ఆ పని ఎందుకు చేస్తున్నారు?

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల మధ్య ప్రేమ, డేటింగ్ అనే వ్యవహారాలు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి.పెళ్లయి విడాకులు తీసుకున్న తర్వాత కూడా మళ్లీ ప్రేమ అంటూ రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు.

 Hero Siddharth Aditi Rao Hydari Again Caught Together In A Web Series Event-TeluguStop.com

నిజానికి నటీనటులకు ఇటువంటివన్నీ కామన్ అని చెప్పాలి.ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో ఎప్పుడు విడిపోతారో కూడా తెలీదు.

ఇక కొన్ని కొన్ని సార్లు కలిసి బయట తిరిగినా తమ మధ్య ఎటువంటి వ్యవహారాలు లేవు అంటూ కబుర్లు చెబుతూ ఉంటారు.ఇక ఇప్పుడు అటువంటిదే సిద్ధార్థ్, అదితీ రావు కూడా చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రానికి చెందిన తెలుగు అమ్మాయి అదితి రావు హైదరి.( Aditi Rao Hydari ) కానీ ఎక్కువగా హిందీ సినిమాలలో నటించింది.అంతేకాకుండా తెలుగు, తమిళ, మలయాళ భాషలలో కూడా నటించింది.సమ్మోహనం, అంతరిక్షం వంటి సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఇక ఈ సినిమా కంటే ముందు 2006లో మలయాళం సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

Telugu Aditi, Siddharth, Siddharthaditi, Web-Movie

ఇక తెలుగు అమ్మాయి అయినప్పటికీ కూడా బాలీవుడ్ నటిగా పేరు సంపాదించుకుంది.ఇప్పుడు ఎక్కువగా అక్కడే సినిమాలు నటిస్తుంది.ఈ బ్యూటీ వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది.

అయితే తనతో కలిసి నటించిన హీరో సిద్ధార్థతో( Hero Siddharth ) కొన్ని రోజుల నుండి బాగా సమయాన్ని గడుపుతూ ఉంది.ఇక హీరో సిద్ధార్థ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సిద్ధార్థ్ అందరికీ పరిచయమే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకున్నాడు.

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా నటించాడు.కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, సింగర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఈయన తెర ముందు ఎంత సైలెంట్ గా ఉంటాడో తెరవెనుక మాత్రం బాగా వైలెంట్.

Telugu Aditi, Siddharth, Siddharthaditi, Web-Movie

ముక్కుసూటిగా తన నోటికి వచ్చే విధంగా అవతలి వారి పై విమర్శలు చేస్తూ ఉంటాడు.ఈయన 2003లో బాయ్స్ సినిమాతో( Boys Movie ) తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఈ సినిమా తనకు మంచి గుర్తింపు ఇవ్వడంతో ఆ తర్వాత బొమ్మరిల్లు, ఆట వంటి పలు సినిమాలలో కూడా నటించాడు.

ఇక నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా మాత్రం అతడికి మంచి సక్సెస్ ని అందించింది.

ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయనకు కొన్ని వివాదాలు రావడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు.

కారణం ఏంటంటే సినిమాలతో తనకొచ్చిన బాగా గర్వం రావడంతో.ఇండస్ట్రీలో ఓవర్గా ప్రవర్తించాడు.

దర్శక నిర్మాతలతో ఎక్స్ట్రాలు మాట్లాడాడు.దింతో అతడికి సినిమాలలో అవకాశాలు లేకుండా చేశారు.

మళ్లీ ఇంత కాలానికి రీఎంట్రీ కూడా ఇచ్చాడు.

Telugu Aditi, Siddharth, Siddharthaditi, Web-Movie

కానీ ఇప్పుడు అంతగా అవకాశాలు కూడా అందుకోవటం లేదు.అయితే వ్యక్తిగతంగా మాత్రం ఈయన గతంలో ఎంత హాట్ టాపిక్ గా మారాడు అందరికీ తెలిసిందే.ముఖ్యంగా ఈయన పెళ్లి వ్యవహారాలలో మాత్రం బాగా వార్తలలో నిలిచాడు.

ఇంతకాలం సైలెంట్ గా ఉన్న ఇతడు రీఎంట్రీ తో మళ్లీ ఒక వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు.

తనతో కలిసి నటించిన అదితి రావుతో బాగా తిరుగుతూ ఉన్నాడు.

చాలాసార్లు ఇద్దరు మీడియా దృష్టిలో కూడా పడ్డారు.దీంతో వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది అని అందరూ అనుమానం పడ్డారు.

చాలాసార్లు మీడియా వారిని కూడా ప్రశ్నించింది.కానీ తమ మధ్య ఎటువంటి ప్రేమ లేదు అని, డేటింగ్ లేదు అని చెప్పుకుంటూ వచ్చారు.

కానీ ఇద్దరు మాత్రం ఎక్కడికైనా కలిసి తిరుగుతున్నారు.ఇటీవలే అదితి నటించిన ఓ సీరిస్ ఫంక్షన్ లో కూడా సిద్ధార్థ ఆమెతో కనిపించడంతో మరింత అనుమానాలు వస్తున్నాయి.

ప్రేమ లేదని.డేటింగ్ లేదని మళ్లీ ఎందుకు అలా తిరుగుతున్నారు అంటూ మీ మధ్యలో ఉంది ఏంటో ఒకసారి క్లారిటీ ఇవ్వండి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube