బీసీసీఐపై నిప్పులు చెరిగిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..!

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ( Imran Khan )తాజాగా బీసీసీఐ పై కొన్ని విమర్శలు చేశారు.ఐపీఎల్( IPL ) లో పాకిస్తాన్ క్రికెటర్లకు( Pakistani cricketers ) అనుమతించకపోవడంపై స్పందిస్తూ.

 Imran Khan, The Former Prime Minister Of Pakistan, Is On Fire On Bcci ,shoaib Ak-TeluguStop.com

బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని, అత్యధిక ఆదాయం ఇస్తున్న క్రమంలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుందని ఘాటు విమర్శలు చేశారు.

బీసీసీఐ పాకిస్తాన్ ఆటగాళ్లను టార్గెట్ చేసిందని, తమ దేశ ఆటగాళ్లను భారత్ లో జరిగే ఐపీఎల్ లో అనుమతించకపోవడం చాలా బాధాకరం అని తెలిపారు.

బీసీసీఐ ( బీసీసీఐ )తమకు ఎవరు కావాలో వారిని ఎంపిక చేసుకుని ఐపీఎల్ లో ఆడిస్తుందని, ప్రపంచ క్రికెట్లో అత్యధిక ఆదాయం బీసీసీఐ గడిస్తుందని, అందుకే అహంకార ధోరణితో ప్రవర్తిస్తుందని తెలిపారు.ఇప్పుడు ఈ విషయంపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

ఐపీఎల్ లో ఆడించకపోవడంపై బాధపడాల్సిన అవసరం లేదని.దేశవాళీ క్రికెట్ తో పాటు జాతీయ జట్టుకు ఆడి అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ క్రికెటర్లు తమ సత్తా చాటాలని ఇమ్రాన్ ఖాన్ సూచించారు.ఐపీఎల్ మొదటి లీగ్ లో పాకిస్తాన్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, కమ్రాన్ అక్మల్, సోహైల్ తన్వీర్, షాహిద్ ఆఫ్రిది లాంటి ఆటగాళ్లు చక్కగా ఆడారని.ఇరుదేశాల మధ్య సరిహద్దుల వివాదం, రాజకీయ కారణాల వల్ల పాకిస్తాన్ క్రికెటర్లపై బీసీసీఐ బ్యాన్ విధించింది.

గత కొంతకాలంగా ఆసియా కప్ నిర్వహణ వివాదం ఎన్నో చర్చల తర్వాత ఓ కొలిక్కి వచ్చింది.ఇక తాజాగా భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ విషయంలో మరో సరికొత్త సమస్య తెచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.భారత ఆటగాళ్లు ఆసియా కప్ మ్యాచ్ ల కోసం పాకిస్తాన్ కు రానప్పుడు.పాకిస్తాన్ ఆటగాళ్లు వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ ల కోసం భారత్ కు ఎలా వస్తారని ఐసీసీకి లేఖ రాసింది.

ఈ విషయంలో ఐసీసీ చర్చలు జరుపుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube