'రావణాసుర' పక్కా హిట్ అంటున్న మాస్ రాజా.. మరి మరో హిట్ అందుకుంటాడా?

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ ‘రావణాసుర’(Ravanasura) .ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

 I Strongly Believe Ravanasura Ravi Teja Comments Viral Details, Ravanasura, Rava-TeluguStop.com

అభిషేక్ పిక్చర్స్, ఆర్టి టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్ తో రావణాసుర టీమ్ ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెంచేందుకు కృషి చేస్తున్నారు.ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ( Ravanasura Pre-Release Event ) నిన్న రాత్రి ఘనంగా జరిగింది.

హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.మరి ఈ వేడుకలో రవితేజ కూడా మాట్లాడగా సినిమాపై ఈయన కాన్ఫిడెంట్ గా కనిపించాడు.

రవితేజ మాట్లాడుతూ.ఈ సినిమా కోసం సుధీర్ వర్మ ప్రాణం పెట్టారని.అలానే నిర్మాతలతో పాటు టెక్నీషియన్స్ అందరు కూడా ఎంతో కస్టపడి పనిచేశారని.ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ తో పాటు హీరోయిన్స్ అందరు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారని.

మొత్తంగా రావణాసుర మూవీ మంచి ఎంటర్టైనర్ గా ఫ్యాన్స్ ను ఆడియెన్స్ ను ఆకట్టు కుంటుందనే నమ్మకం ఆయన వ్యక్తం చేసారు.చూడాలి మరి ఈ ఏడాది ఈయన మరో హిట్ అందుకుంటాడా లేదా.

ఇక ఈ సినిమాలో మాస్ రాజాకు జోడీగా ఐదుగురు హీరోయిన్స్ నటించారు.అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ లు నటిస్తుండగా.హర్ష వర్ధన్, భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నారు.అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తుండగా.ఏప్రిల్ 7న పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube