నేటి నుండే పదవ తరగతి పరీక్షలు...!

సూర్యాపేట జిల్లా: నేటి నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మునగాల మండల విద్యాధికారి సలీం షరీఫ్ తెలిపారు.సోమవారం నుండి నిర్వహించే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మండల పరిధిలో రెండు సెంటర్లలో 299 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు.పరీక్షలు ఈనెల మూడు నుండి 13 వరకు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.ప్రతి సెంటర్లో డిఓలతో పాటు 15 మంది ఇన్విజిలెటర్లను,ఇతర శాఖల నుండి ప్రతి సెంటర్లో ఒక సెట్టింగ్స్ స్క్వాడ్ ను నియమించారన్నారు.

 Education Officer Of Munagala Mandal About Tenth Class Exams, Education Officer-TeluguStop.com

విద్యార్థులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించడానికి వైద్య శాఖ నుండి ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటారని తెలిపారు.పరీక్ష కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని,పరీక్షా కేంద్రాలన్నీ సీసీ కెమెరా నిఘాలో ఉన్నాయని, పరీక్షలు సీసీ కెమెరా నిఘా లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రతి సెంటర్లో పారిశుద్ధ్యం,తాగునీటి వసతి కోసం గ్రామపంచాయతీ సహకార తీసుకున్నామని, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిరంతర విద్యుత్ సౌకర్యం,పోస్టల్ శాఖ సహకారంతో ప్రశ్న పత్రాలు మూల్యాంకన కేంద్రాలకు తరలించడం,ఆర్టీసీ వారి సహకారంతో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం వంటి చర్యలు తీసుకున్నారన్నారు.రెవిన్యూ,పోలీస్ శాఖల పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

పరీక్షా కేంద్రంలో సెల్ఫోన్లను పూర్తిగా నిషేధించారని,పరీక్షా సమయం ప్రారంభం కాగానే ఇతరులు గాని, పరీక్షా సిబ్బంది గాని బయటకి లోపలికి తిరిగే ఆస్కారం లేదని తెలిపారు.విద్యార్థులు సకాలంలో హాల్ టికెట్ తో పరిక్ష కేంద్రానికి చేరుకొని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు.

హాల్ టికెట్లు బోర్డు వెబ్సైట్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.విద్యార్థులు ఎవరు కూడా యూనిఫామ్ ధరించి పరీక్షా కేంద్రాన్ని హాజరు కావద్దని సూచించారు.జిల్లా కలెక్టర్,డిఈఓ ఇతర ఉన్నతాధికారుల ఆదేశానుసారం అన్ని చర్యలు తీసుకొని విద్యార్థులు శాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube