అమెరికాలో లయ ఏ ఉద్యోగం చేస్తున్నారు.. ఆమె నెల జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి స్వయంవరం( Swayamvaram ) సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి లయ(Laya).మొదటి సినిమాకే నంది అవార్డు(Nandi Award) అందుకున్నటువంటి ఈమె దాదాపు 13 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చారు.

 What Kind Of Job Is Laya Doing In America You Will Be Shocked If You Know Her M-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె అమెరికాకు చెందిన ఒక డాక్టర్ ను వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు.ఇలా 2006వ సంవత్సరంలో వివాహం చేసుకొని అమెరికా వెళ్లినటువంటి లయ అక్కడ ఉద్యోగం చేస్తూ భారీగా డబ్బు సంపాదించే వారిని తెలుస్తుంది.

ఇలా అమెరికాలో స్థిరపడిన లయ చాలా కాలం తర్వాత ఇండియాకు(India) తిరిగివచ్చారు అయితే ఈమె ఇండియాకు రావడంతో పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె అమెరికాలో తను ఏం చేస్తుండేవారో తెలియజేశారు.2011 నుంచి ఈమె ఐటీ సెక్టార్ ఉద్యోగం చేసే వారని తెలియజేశారు.అయితే ఇండియాకు చెందిన కంపెనీకి తాను ఉద్యోగం చేసే దానిని వెల్లడించారు.

ఆ సమయంలో తనకు టాక్స్ లన్ని పోను నెలకు 12000 డాలర్ల జీతం వచ్చేదని తెలిపారు.

ఇక ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈమె నెలకు ఏకంగా 960,000 జీతం అందుకునే వారని ఈ సందర్భంగా లయ తెలియజేశారు.ఇక తాను 2017లో ఈ జాబ్ వదిలేసానని అనంతరం డాన్స్ స్కూల్ ప్రారంభించామని తెలిపారు.అయితే కోవిడ్ కారణంగా తన డాన్స్ స్కూల్ కూడా మూతపడిందని లయ(Laya) తెలియజేశారు.

ఇక డాన్స్ స్కూల్ మూతపడటంతో తాను ఇంస్టాగ్రామ్స్ రీల్స్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు.ఇలా అమెరికాలో ఈమె ఐటీ ఉద్యోగం చేస్తూ భారీగానే డబ్బు సంపాదించారని తెలుస్తోంది.

చాలా కాలం తర్వాత ఇండియాకు వచ్చినటువంటి ఈమె హైదరాబాద్ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయని న్యూయార్క్ సిటీ కన్నా హైదరాబాద్ చాలా అందంగా ఉంది అంటూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube