మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ramcharan )మార్చి 27వ తేదీ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఇలా ఈయన పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఒకవైపు అభిమానులు పెద్ద ఎత్తున సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.
అలాగే చరణ్ పుట్టినరోజు సందర్భంగా కేవలం సౌత్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు కూడా ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ఇంట్లో జరిగిన చరణ్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొని సందడి చేశారు.

ఇలా చరణ్ పుట్టినరోజు వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.అయితే బన్నీ నుంచి రామ్ చరణ్ కు ఏ విధమైనటువంటి విషెస్ రాకపోవడంతో మరోసారి రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి అనే వార్తలు తెరపైకి వచ్చాయి.సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే అల్లు అర్జున్( Allu Arjun ) మాత్రం ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియ చేయకపోవడంతో మరోసారి ఈ విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి.

రామ్ చరణ్ కు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి తనకు శుభాకాంక్షలు తెలియజేశారేమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడ ఒక పోస్ట్ కూడా చేయలేదు.ఇలా సాయంత్రం వరకు చాలా ఓపికగా ఎదురుచూసినటువంటి మెగా ఫాన్స్ అల్లు అర్జున్ విషెస్ చెప్పకపోవడంతో మరోసారి మెగా అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని అందుకు నిదర్శనమే ఇది అంటూ పెద్ద ఎత్తున ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.ఇలా రామ్ చరణ్ పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటే కనీసం విష్ చేయలేనంత బిజీగా అల్లు అర్జున్ ఉన్నాడా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2( Pushpa 2 ) సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.







