ఎట్టకేలకు వాట్సాప్‌లో ప్రత్యక్షమైన ఎడిట్ ఫీచర్.. లాంచ్ అప్పుడే!!

వాట్సాప్( Whatsapp ) ప్రస్తుతం మెసేజ్‌లను ఎడిట్ చేయడానికి యూజర్లను అనుమతించే కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది.ఈ ఫీచర్ కోసం వాట్సాప్ యూజర్లు ఎంతో కాలంగా కళ్ళు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు.అయితే ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్‌లో ఉంది కానీ టెస్ట్‌ఫ్లైట్ యాప్‌లో అందుబాటులో ఉన్న వాట్సాప్ బీటా iOS 23.6.0.74 అప్‌డేట్‌లో ఎడిట్ ఫీచర్ ప్రత్యక్షమైంది.ఇందులో యూజర్ ఒక మెసేజ్‌ను ఎడిట్ చేసినప్పుడు, సంభాషణలో ఉన్న ప్రతి ఒక్కరికీ మెసేజ్ ఎడిటెడ్ అని కనిపిస్తోంది.ఒక డెడికేటెడ్ అలర్ట్( Dedicated alert ) ఇలా కనిపించడం చూస్తుంటే వాట్సాప్ దీనిని సక్సెస్‌ఫుల్‌ డెవలప్ చేసినట్టు తెలుస్తోంది.

 Finally The Live Edit Feature On Whatsapp Just Launched, Whatsapp, Edit Feature-TeluguStop.com

యూజర్లకి దీనిని పరిచయం చేసే ముందు కొన్ని టెస్ట్‌లు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది రావడానికి ఇంకాస్త సమయం పట్టవచ్చు.

Telugu Edit, App, Tech, Whatsapp-Latest News - Telugu

ఇకపోతే మెసేజ్‌ని ఎడిట్ చేసి పాత WhatsApp వెర్షన్‌ని ఉపయోగిస్తున్న వ్యక్తులకు పంపినట్లయితే, అది వారికి కూడా ఎడిట్ కావాలి.కానీ ప్రస్తుతం టెస్ట్‌ఫ్లైట్ యాప్‌లో అలా జరగడం లేదు.అయితే ఎడిట్ ఫీచర్‌ను అందరికీ రిలీజ్ చేసే నాటికి ఓల్డ్ వెర్షన్లకు కూడా ఎడిటెడ్ మెసేజ్ సపోర్ట్ అయ్యేలా వాట్సాప్ మార్పులు చేసే అవకాశముంది.

ఎడిట్ చేసిన మెసేజ్‌ను స్వీకరించడానికి యూజర్లు యాప్ లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుందని దీని అర్థం.

Telugu Edit, App, Tech, Whatsapp-Latest News - Telugu

ఇకపోతే తమ తప్పులను త్వరగా, సులభంగా సరిదిద్దడానికి ఈ ఫీచర్‌ ఎంతగానో హెల్ప్ అవుతుంది.ప్రస్తుతం పంపిన మెసేజ్ లో ఏదైనా మిస్టేక్ ఉంటే దానిని ఎడిట్ చేయడం కుదరదు.ఆ మిస్టేక్ సరి చేసుకోవడానికి మెసేజ్ అంతా డిలీట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి టైప్ చేయాల్సి ఉంటుంది దీని వల్ల చాలా సమయం వేస్ట్ అవుతుంది.

అందుకే దిగ్గజ మెసేజ్ యాప్ ఈ ఫ్యూచర్ ని పరిచయం చేసి యూజర్ల సమయాన్ని, శ్రమను ఆదా చేయాలని చూస్తోంది.వినియోగదారులు 15 నిమిషాలలోపు మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చట.

ఇక ఎడిటెడ్ మెసేజ్‌లో మెసేజ్ బబుల్‌లో “ఎడిటెడ్” లేబుల్‌ కనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube