సోషల్ మీడియాలో మన స్టార్ హీరోలకు ఫాలోయింగ్ బాగా ఉన్న విషయం తెల్సిందే.ముఖ్యంగా మన స్టార్ట్ హీరోలకు సోషల్ మీడియాలో మిలియన్స్ కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు.
ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారు.సూపర్ స్టార్ గా ప్రేక్షకుల చేత మన్ననలు పొందుతున్న మహేష్ బాబు( Mahesh Babu ) సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.
తాజాగా మహేష్ సోషల్ మీడియాలో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.సోషల్ మీడియాలో ఎప్పటి నుండి భారీ క్రేజ్ ఏర్పరుచుకున్న మహేష్ కు ట్విట్టర్ లో అయితే లక్షకి పైగా లైక్స్ పోస్ట్ లు ఎన్నో ఉన్న ఏకైక హీరోగా రికార్డ్ అతని పేరు మీద ఉంది.
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ఫీట్ అవరోదించారు.ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో 10 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన ఏకైక టాలీవుడ్ హీరోగా మహేష్ బాబు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు.

ఇటీవలే మహేష్ ఇంస్టాగ్రామ్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ ను దాటేశాడు.ఇక ఇప్పుడు ఈ మూడు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా సౌత్ నుండి రికార్డ్ అందుకున్నాడు.ఇదిలా ఉండగా ప్రజెంట్ మహేష్ బాబు తన 28వ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల( Pooja Hegde, Srileela ) హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇప్పటికే వీరి కాంబోలో రెండు సినిమాలు రాగా ముచ్చటగా మూడవసారి మహేష్ తో సినిమా చేస్తున్నాడు.
చూడాలి గురూజీ ఈసారి మహేష్ కు బ్లాక్ బస్టర్ అందిస్తాడో లేదో.







