వైరల్: కొడుకు, కోడలి ఫొటో షూట్ కోసం అత్తామామల ప్రయాస చూడండి!

స్మార్ట్ ఫోన్స్ వాడకం విరివిగా పెరిగాక సోషల్ మీడియా వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది.దాంతో దేశంలో జరిగిన ఎటువంటి సంఘటనలు అయినా మనం యిట్టె తెలుసుకోగలుగుతున్నాం.

 In-laws Helping Their Daughter-in-law Get A Perfect Picture At The Beach Viral V-TeluguStop.com

ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా పెళ్ళికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం చూస్తూ వున్నాం.ఈ క్రమంలోనే బీచ్‌లో ( Beach ) భ‌ర్త‌తో క‌లిసి ఫోటో తీసుకునేందుకు కోడ‌లికి ( Daughter-In-Law ) స‌హ‌క‌రించిన అత్తా మామ‌ల వీడియో ఒకటి ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోను న‌టుడు ‘భూష‌ణ్ ప్ర‌ధాన్’ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా వెలుగు చూసింది.ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ 19 ల‌క్ష‌ల మంది వీక్షించడం కొసమెరుపు.ఈ క్లిప్‌లో త‌న భ‌ర్త‌తో బీచ్‌లో ప‌ర్ఫెక్ట్ ఫొటో తీసుకునేందుకు కోడ‌లుకు వృద్ధ దంపతులు స‌హ‌క‌రించిన తీరు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.కోడ‌లి దుప‌ట్టాను ఆమె అత్త ప‌ట్టుకోగా మామ కెమెరాలో క్లిక్ మ‌నిపించ‌డం ఇక్కడ స్పష్టంగా క‌నిపిస్తుంది.

బీచ్‌లో ప‌ర్ఫెక్ట్ ఫొటో( Photoshoot ) వ‌చ్చేందుకు కోడ‌లికి స‌హ‌క‌రిస్తున్న అత్తామామ‌ల‌ను చూస్తుంటే ముచ్చ‌టేస్తుంద‌ని ఈ పోస్ట్‌కు క్యాప్ష‌న్ ఇవ్వడం కూడా చూడవచ్చు.

ఈ కూల్ విడియోపైన నెటిజ‌న్లు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.‘ఓ మైగాడ్! ఇలాంటివి చాలా అరుద‌ని ఓ యూజ‌ర్ కామెంట్ చేయ‌గా, ‘సో ల‌వ్‌లీ’ అంటూ మ‌రో యూజ‌ర్ కామెంట్ చేయడం చూడవచ్చు.ఇలాంటి అత్తమామలను ఎక్కడా చూడలేదని కొందరంటుంటే….‘ఆ కోడలు చాలా అదృష్టవంతురాలు’ అని మరికొంతమంది కామెంట్ చేయడం ఇక్కడ చూడవచ్చు.మరెందుకాలస్యం, మీరు ఈ వీడియో చూసి మీమీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube