బజాజ్ పల్సర్ NS200, NS160 అప్డేట్ మోడల్స్.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..!

ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ బజాజ్ కంపెనీ( Bajaj Company ) నుండి బజాజ్ పల్సర్ NS200, NS160 వేరియంట్లను గ్రాఫిక్స్, మల్టిపుల్ సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్ అప్డేట్ తో మార్కెట్లోకి విడుదల చేసింది.పల్సర్ బైక్ కు భారత దేశంలో ఎంతో మంచి ఆదరణ ఉంది.

 బజాజ్ పల్సర్ Ns200, Ns160 అప్డేట్ మోడ-TeluguStop.com

బజాజ్ పల్సర్ బైక్ ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు ఏంటో చూద్దాం.ఇందులో డ్యూయల్ ఛానల్ ABS, బ్రేకింగ్ సిస్టంలో 300 ఎంఎం ఫ్రంట్ డిస్క్, 230 ఎంఎం, గేర్ పొజిషన్ ఇండికేటర్, డిస్టెన్స్- టు- ఎంప్టీ రీడౌట్, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, ఇన్స్టంటేనియస్ ఫ్యూయల్ తో సిగ్నేచర్ ఇన్ఫినిటీ డిస్ ప్లే కలిగి ఉంది.

ఇక బజాజ్ పల్సర్ ఇంజన్( Bajaj Pulsar engine ) గమనించినట్లయితే NS 200- 2023 మోడల్ లో 199.5cc ట్రిపుల్ స్పార్క్ DTS -i 4V పెట్రోల్ ఇంజన్, 24.3 bhp వద్ద మాక్సిమం పవర్, 18.7 Nm వద్ద మాక్సిమం టార్క్ ఉత్పత్తి లతో అద్భుతంగా ఉంది.ఒకసారి పాత మోడల్ గమనించినట్లయితే 1.15 కిలోల వెయిట్ తక్కువగా ఉండటం వల్ల క్లాస్ లీడింగ్ పవర్ ని కలిగి ఉందని కంపెనీ తెలిపింది.NS 160-2023 మోడల్ విషయానికి వస్తే 160.3cc ట్విన్ స్పార్క్ FI DTS -i పెట్రోల్ ఇంజన్, 17bhp వద్దా మాక్సిమం పవర్, 14.6Nm వద్ద మాక్సిమం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.NS 200 మోడల్ ధర రూ.1.47 లక్షలు, NS 160 మోడల్ ధర రూ.1.35 లక్షలు గా ఉంది.ఫ్యూటర్ గ్రే( Futher Grey ), శాటిన్ రెడ్, గ్లోసీ ఎబోనీ బ్లాక్, మెటాలిక్ పెరల్ వైట్ లాంటి కలర్లతో ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలలో లాంచ్ అయింది.NS సిరీస్ ల పనితీరు మెరుగుగా ఉండడంతోపాటు మంచి పికప్ ను కలిగి ఉంది.

కొత్త అడ్వాన్స్ ఫీచర్స్ తో వచ్చిన ఈ మోడల్స్ దక్షిణ అమెరికా, ఆసియా దేశాల్లో మంచి డిమాండ్ ఉంది.ఈ రెండు మోడల్స్ కొనుగోలుదారులకు ఆకట్టుకుంటున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube