గెలవాలన్న కసి, పట్టుదల రాజు కన్నా సైన్యానికే ఎక్కువ ఉంది.

జనసేన పార్టీ( Janasena Party ) రాజకీయ పరిణామాలను దగ్గరగా గమనిస్తున్న వారికి ఏర్పడుతున్న అభిప్రాయం ఇది.ప్రయోజనం లేకుండా ఎవరూ ఎవరి కోసం కనీస సమయం కూడా కేటాయించని ఈ రోజుల్లో అసలు గెలుస్తుందో లేదో, గెలిచినా ఎన్ని సీట్లలో గెలుస్తుందో అన్న కనీస అవగాహన లేని ఒక పార్టీ కోసం తమ విలువైన ఇంత సమయాన్ని కేటాయిస్తూ, ఏర్పాటు చేస్తున్న ప్రతి సభను విజయవంతం చేస్తూ, తమ అధినాయకుడి ప్రసంగం చివరి వరకు క్రమశిక్షణగా వింటూ , ఆయన ప్రసంగాలను సామాన్య జనం లో ప్రచారం చేస్తూ నిలబడుతున్న జనసైనికుల ( Janasainiks ) మనోధైర్యాన్ని, పట్టుదలను చూస్తుంటే గెలవాలన్న కోరిక పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కంటే జనసైనికులకి ఎక్కువగా ఉన్నట్లు కనబడుతుంది.

 Pawan Kalyan Janasena Formation Day Meeting A Huge Success Details, Pawan Kalyan-TeluguStop.com

ఈరోజు రాజకీయ సభలు విజయవంతం అవ్వాలంటే డబ్బు ,మద్యం తప్పనిసరి అయ్యిపోయింది.

Telugu Janasainiks, Janasena Day, Janasena, Machilipatnam, Pawan Kalyan, Pawan K

వాహనాలను సమకూర్చి, పథకాలు ఆపు చేస్తామని భయపెట్టి, రకరకాల తాయిలాల ఆశ చూపించి సభ వరకు తీసుకెళ్లినా కూడా సభ మొదలైన కొద్దిసేపట్లోనే మెల్లగా తిరుగు ముఖం పడుతున్నారు.అలాంటి సమయంలో షెడ్యూల్ ప్రకారం ఏడున్నరకు మొదలవ్వాల్సిన సభ అడుగడుగునా వారాహి కి అడ్డం పడుతున్న అభిమానులు కోలాహలం , కేరింతలతో ఐదు గంటలు ఆలస్యంగా మొదలైనా కూడా ఓపికగా ఎదురు చూశారు తప్ప తిరిగి వెళ్లాలని ఆలోచన కూడా కనీసం ఎవరికి లేదు.పదిన్నరకు మొదలైన సభ 12 వరకు కొనసాగినా కూడా అర్ధరాత్రి అని లేకుండా ప్రసంగం చివరి వరకు విని సభను విజయవంతం చేశారు.

Telugu Janasainiks, Janasena Day, Janasena, Machilipatnam, Pawan Kalyan, Pawan K

రాజకీయాలను పక్కన పెట్టి చూస్తే ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో విజయవంతమైన సభను మనం చూడలేం.దీనిని బట్టి పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదల కోసం ఆయన కంటే కూడా జనసైనికులు ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది .ఇంతమంది అశేష అభిమానుల ఆదరణను దక్కించుకున్న ఆయన నిజంగా అదృష్టవంతుడనే చెప్పాలి.ఇక ఆయన చేయాల్సిందల్లా ఈ అభిమానాన్ని పూర్తిస్థాయి ఓట్ల కింద మార్చుకునే యంత్రాంగాన్ని తయారు చేసుకోవడమే.

ఎన్నికలు వచ్చేవరకు ఆయన బూత్ కమిటీలను బలపరుచుకొని మండల వారి కమిటీలను ఏర్పాటు చేసుకొని ,నాయకులకు కావలసిన నైతిక మద్దతు ఇస్తూ ముందుకు నడిపితే జనసైనికులే ఆయనకు ముఖ్యమంత్రి స్థానాన్ని పువ్వుల్లో పెట్టి అందిస్తారని విశ్లేషణలు వినపడుతున్నాయి.మరి ఈ స్తాయి అభిమానాన్ని ఆయన ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు, ఏ స్థానాన్ని అందుకుంటారు అన్నది ఆయన అనుసరించే వ్యూహాలపై ఆధార పడి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube