ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ రావడంతో ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల గురించి చర్చ జరుగుతోంది.అయితే కేంద్ర ప్రభుత్వం ఛెల్లో షో సినిమాకు బదులుగా ఆర్.ఆర్.ఆర్ సినిమాను ఆస్కార్( Oscar ) కు పంపి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపించాయి.ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్( A.R.Rahman ) సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.
కొన్ని సందర్భాల్లో మన సినిమాలు ఆస్కార్ వరకు వెళ్లి నిరాశతో వెనక్కు తిరిగి వస్తుంటాయని ఆయన అన్నారు.
అర్హత లేని సినిమాలను ఆస్కార్ కు పంపుతున్నారని కొన్నిసార్లు అనిపిస్తుందని ఆయన వెల్లడించారు.కానీ అలా చేయడాన్ని చూస్తూ ఉండటం తప్ప మనం ఏం చేయలేమని ఏఆర్ రెహమాన్ పేర్కొన్నారు.
ఏఆర్ వెల్లడించిన విషయాలు నిజమేనని మరి కొందరు చెబుతున్నారు.
ఆస్కార్ అవార్డ్ కు పంపే సినిమాల విషయంలో కేంద్ర ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరించాలని క్రేజ్ లేని సినిమాలను ఆస్కార్ కు పంపి ఉపయోగం ఏంటని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.అర్హత ఉన్న ఆర్.ఆర్.ఆర్ ను ఆస్కార్ కు( RRR ) పంపి ఉంటే బాగుండేదని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు.రెహమాన్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
ఆయన మ్యూజిక్ స్పెషల్ గా ఉంటుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తారనే సంగతి తెలిసిందే.ఏఆర్ రెహమాన్ ఈ మధ్య కాలంలో తెలుగులో ఎక్కువ సినిమాలకు మ్యూజిక్ అందించడం లేదు.ఏఆర్ రెహమాన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.ఏఆర్ రెహమాన్ సినీ కెరీర్ లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి.రెహమాన్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తారని కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.రెహమాన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.