నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన దసరా సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమల స్పీడ్ పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు.
గత నెలలో కాస్త హడావుడి చేసిన నాని గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్నాడు.దసరా సినిమా ను ఆర్ఆర్ఆర్.
కాంతార మరియు కేజీఎఫ్ 2 లతో నాని పోల్చిన నేపథ్యం లో అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఆ సమయంలో అంతగా హడావుడి చేసిన నాని ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.
దసరా సినిమా కు కనీసం నెల రోజుల ముందు నుండే ప్రచారం చేస్తే తప్ప మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో దసరా సినిమా యొక్క హడావుడి పెంచాల్సిన అవసరం చాలానే ఉంది అనేది కొందరి అభిప్రాయం.
భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందిన దసరా సినిమా లో కీర్తి సురేష్ నటించింది.సినిమా లో నాని మరియు కీర్తి సురేష్ యొక్క లుక్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.నాని గతంలో ఎప్పుడు కనిపించనంత మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు.నాని కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ లో ఎప్పటికి నిలిచి పోయే సినిమా గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
దసార సినిమా విడుదల మంత్ వచ్చేసింది.కనుక ఈ సమయంలో సినిమా విడుదలకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.నాని కౌంట్ డౌన్ మొదలు పెట్టిన నేపథ్యం లో ఫ్యాన్స్ సోషల్ మీడియా సందడి ని మొదలు పెట్టాలని భావిస్తున్నారు.అందుకు గాను పోస్టర్స్.పాటలు మరియు మేకింగ్ వీడియోలు ట్రైలర్ విడుదల అవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు.