సాధారణంగా ఇతర నెలలతో పోల్చి చూస్తే ఫిబ్రవరి నెలలో తక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవుతాయనే సంగతి తెలిసిందే.తక్కువ రోజులు ఉండటంతో పాటు ఫిబ్రవరి, మార్చి నెలలలో విద్యార్థులకు సెలవులు ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ సినిమాలే ఈ నెలలో విడుదల కావడం జరుగుతుంది.
జనవరి నెలలో విడుదలైన సంక్రాంతి సినిమాలలో దాదాపుగా అన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఫిబ్రవరి నెల ఫస్ట్ వీక్ లో మైఖేల్, బుట్టబొమ్మ, రైటర్ పద్మభూషణ్ సినిమాలు విడుదల కాగా ఈ మూడు సినిమాలలో రైటర్ పద్మభూషణ్ మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంది.సుహాస్ కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టినా ఈ సినిమా మరీ ఓ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం కాదు.ఫిబ్రవరి నెల 2వ వారంలో భారీ అంచనాలతో అమిగోస్ మూవీ విడుదలైంది.
బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో నటించినా ప్రేక్షకులను మెప్పించడంలో ఈ సినిమా ఫెయిలైంది.అదే వారంలో అల్లంత దూరాన, వసంత కోకిల, పాప్ కార్న్, వేద సినిమాలు రిలీజ్ కాగా ఈ సినిమాలను సినిమా లవర్స్ పెద్దగా పట్టించుకోలేదు.ఫిబ్రవరి నెల మూడో వారంలో సార్, వినరో భాగ్యము విష్ణుకథ సినిమాలు విడుదలయ్యాయి.
ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచాయి.

ఫిబ్రవరి నెల చివరి వారంలో మిస్టర్ కింగ్, కోనసీమ థగ్స్, డెడ్ లైన్ సినిమాలు రిలీజ్ కాగా ఈ సినిమాలు సైతం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.ఫిబ్రవరి నెలలో కేవలం మూడంటే మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలవడం గమనార్హం.మార్చి నెలలో విడుదలవుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది.







