ఇటీవలే కాలంలో వివాహేతర సంబంధాలకు వావి వరసలు, వయసుతో సంబంధం లేదు.చిన్న పెద్ద తేడా లేకుండా కేవలం ఆకర్షణకు లోనై, శారీరక సుఖం కోసం ఎటువంటి దారుణాలైనా చేయడానికి వెనుకడుగు వేయడం లేదు.
తాజాగా శుక్రవారం రాత్రి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల లో జరిగిన హత్యతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామవాసి అయిన కుంచం రామారావు(47) తన భార్య పిల్లలతో కలిసి కంచికచర్ల పెద్ద బజారులోని పోస్ట్ ఆఫీస్ రోడ్డులో అద్దె ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నాడు.
రామారావు రేషన్ డీలర్ గా పనిచేస్తుండగా, అతని భార్య భార్గవి కంచికచర్ల మండలంలోని మోగులూరు గ్రామ సచివాలయంలో ఏఎన్ఎం గా పనిచేస్తుంది.రామారావు, భార్గవి దంపతులకు సంతానం కలగకపోవడంతో రామారావు తమ్ముడు శీను కుమార్తె జోహారికను పెంచుకుంటున్నారు.
అయితే ఐదేళ్ల తరువాత భార్గవికి సుస్మిత అనే పాప జన్మించింది.సంసారం సాఫీగానే సాగుతోంది.

అయితే గతంలో రామారావు కు జేసీపీ ఉండేది.దానికి డ్రైవర్ గా రామారావు గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ ఉండేవాడు.అనుకోకుండా రామారావు భార్యతో ప్రవీణ్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది.రామారావు లేని సమయంలో తరచుగా ప్రవీణ్ కుమార్ ఇంటికి వచ్చేవాడు.ఇక శుక్రవారం అర్ధరాత్రి ప్రవీణ్ ను రామారావు ఇంటిదగ్గర చూసి గట్టిగా మందలించాడు.వీరి మధ్య గొడవ ప్రారంభం కాగా రామారావు భార్య భార్గవి, ప్రవీణ్ తో పాటు అతని స్నేహితులు బుజ్జి బాబు, పులి సురేష్ లు రామారావుపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు.
గొడవ బయటకు వినిపించడంతో గమనించిన చుట్టుపక్కల వారు 108 కి సమాచారం అందించగా, నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3:35 గంటలకు మృతి చెందాడు.మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించగా, రామారావు సోదరుడు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగేంద్ర కుమార్ తెలిపారు.







