ఆస్కార్ గెలిస్తే ఎలా ఫీలవుతారు... అదిరిపోయే సమాధానం చెప్పిన రామ్ చరణ్!

రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం RRR. ఈ సినిమా కేవలం పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

 Ram Charan Interesting Comments In Abc Interview About Rrr Oscar Award Details,-TeluguStop.com

ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ సినిమాలోని నాటు నాటు పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకొని ఆస్కార్ నామినేషన్ లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ పాటకు తప్పనిసరిగా ఆస్కార్ వస్తుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు.

ఇక ఆస్కార్ అవార్డులను మార్చి 12వ తేదీ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికి పెద్ద ఎత్తున అమెరికాలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

నిన్న గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రామ్ చరణ్ తాజాగా ABC (అమెరికన్ బ్రాండ్ కాస్టింగ్ కంపెనీ) స్టూడియోలో స్పెషల్ ఇంటర్వ్యూకూ హాజరయ్యారు.

Telugu Abc Interview, Rajamouli, America, Natu Natu, Oscar Award, Ram Charan, Rr

ఇంటర్వ్యూయర్ రీవ్ విల్ చరణ్ ను ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు.ఈ ప్రశ్నలకు చరణ్ సైతం ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.ఇక ఇంటర్వ్యూలో భాగంగా రీవ్ విల్ ప్రశ్నిస్తూ నాటు నాటు పాటకు కనుక ఆస్కార్ వస్తే మీ స్పందన ఎలా ఉంటుందని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు చరణ్ సమాధానం చెబుతూ 80 సంవత్సరాల సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు అందుకోవడం

Telugu Abc Interview, Rajamouli, America, Natu Natu, Oscar Award, Ram Charan, Rr

ఎంతో గొప్ప విషయం ఇది కేవలం తెలుగు వారు మాత్రమే కాకుండా దేశం మొత్తం గర్వించదగ్గ విషయం.ఇలా ఆస్కార్ అందుకున్న ఆ క్షణం ఇండియా సినిమా గర్వించే క్షణం అవుతుంది.మరోవైపు తాను నమ్మలేని స్థితిలో ఉంటానని చరణ్ తెలిపారు.సినిమా అనేది ఒక ఎమోషన్ కాబట్టి దేశం మొత్తానికి సంతోషాన్ని ఇస్తుందని నేను కూడా చాలా సంతోషిస్తాను అంటూ చరణ్ సమాధానం చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube