భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ తో పూజారా 100 టెస్ట్ మ్యాచ్లు పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 263 పరుగులు చేసి అలౌట్ అయింది.
ఇక టీం ఇండియా మొదటి రోజు చివరి సెషన్ లో 9 ఓవర్లకు గాను ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది.ఇక ఒక సిక్స్ తో ఫామ్ లోకి వచ్చిన కేఎల్ రాహుల్ అదరగొడతాడు అనుకుంటే 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఇక మొదటి టెస్టులో సెంచరీ తో దుమ్ములేపిన రోహిత్ శర్మ కూడా 32 పరుగులు చేసి అవుట్ అవ్వడం బాధాకరం.ఇక రోహిత్ శర్మ తర్వాత బరిలోకి దిగిన పూజారా కు ఇది 100 టెస్ట్ మ్యాచ్.
అభిమానులంతా ఈ మ్యాచ్లో పూజారా రాణిస్తాడని భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.ఈ ప్రతిష్టాత్మకమైన వందో టెస్టులో ఒక్క పరుగు కూడా చేయకుండానే పూజారా అవుట్ కావడంతో క్రికెట్ అభిమానులు ఎంతో నిరాశ నెలకొంది.
పుజారా అవుట్ అయిన తర్వాత కేవలం 54 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది టీమిండియా.ఇక 66 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోవడంతో బారమంతా కోహ్లీపై పడింది.ఇక 125 పరుగుల వద్ద రవీంద్ర జడేజా , 135 పరుగుల వద్ద వీర కోహ్లీ, 139 పరుగుల వద్ద ఎస్ భరత్ ల వికెట్లను టీమిండియా కోల్పోవడంతో కష్టాల్లో పడింది.టాప్ గా ఆడే ఆటగాళ్లు అవుట్ అవడం పట్ల క్రికెట్ అభిమానుల్లో బాధ నెలకొంది.
ప్రస్తుతం 179 పరుగులకు 7 వికెట్లను నష్టపోయిన టీం ఇండియా.ఇక క్రీజ్ లో ఉన్న అక్షర్ పటేల్ మరియు అశ్విన్ ఏ మేరకు రాణించి టీంను గట్టెక్కిస్తారో చూడాలి.