శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎన్విరాన్మెంట్ నీరబ్ కుమార్ ప్రసాద్.

 Ex Minister Somireddy Chandramohan Reddy Mp Sanjeev Kumar And Some Others Visite-TeluguStop.com

, మహారాష్ట్ర అటవీశాఖా మంత్రి సుధీర్ మునిగంటివార్., మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

, కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసారు.

ఆలయం వెలుపల మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.రాష్ట్రంలోని అతి పేదరికంలో ఉన్న గిరిజన కుటుంబాలని ఆశీర్వదించాలని వేడుకున్నానని తెలిపారు.

వైసీపి ప్రభుత్వానికి మిగిలిన సమయంలో మంచి పరిపాలన అందించే విధంగా స్వామి వారు చూడాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలిపారు.ప్రపంచంలో కోట్లాది మంది భక్తులను శ్రీనివాసుడు ఆశీర్వదించడం గొప్ప విషయమన్నారు.

స్వామి వారిని దర్శనం చేసుకోవడం మా మహద్భాగ్యమని పేర్కొన్నారు.గిరిజన కుటుంబాలను, వారి పిల్లలను చూస్తే మనస్సు తలుక్కు పోతుందన్నారు.

టిడిపి అధికారంలోకి వస్తే యానాది కార్పోరేషన్ ప్రారంభించాలని చంద్రబాబును కోరామన్నారు.యానాది కార్పోరేషన్ పెడుతాంమని టిడిపి అధినేత నారా చంద్రబాబు ప్రకటించారని తెలిపారు.

Telugu Neerabkumar, Tirumala Temple-Movie Reviews

యానాధి కుటుంబాలు ఆకలి మంటల్లో లేకుండా కాపాడాలని వేడుకున్నానని, రాష్ట్రంలో చంద్రబాబు, రాజశేఖరరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, షర్మిలమ్మ వంటి వాళ్ళు పాదయాత్ర చేశారని గుర్తు చేసారు.ఇంత ఆంక్షలు, నిబంధనలు ఎప్పుడూ లేవని, ప్రతిపక్షాలను చూసి పోలీసుల అడ్డుపెట్టుకుని లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం అనేది దేశంలోనే మొదటిసారన్నారు.జనతా పార్టి అధినేత చంద్రశేఖర్ గానీ, రాహుల్ గాంధీ గానీ చేసిన పాదయాత్రను ఎవరూ అడ్డంకులు సృష్టించలేదన్నారు.మొదటి సారి చూస్తున్నాం జీవో నెంబర్-1ను తీసుకుని వచ్చి పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

అడ్డంకులు సృష్టిస్తున్న వారిని ఆ దేవుడే చూసుకుంటారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube