ప్రపంచాన్ని ఓ ఊపు ఊపి, వీడియో కంటెంట్ కి సరికొత్త నిర్వచనం చూపించిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ ‘టిక్‌టాక్’ కు ఉన్న ఆదరణ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.ఈ యాప్ సాయంతోనే గల్లీలో వున్న టాలెంట్ కూడా ఈరోజు వెలుగు చూసిందని చెప్పుకోవాలి.
ఈ క్రమంలో రాత్రికి రాత్రే స్టార్లుగా ఎదిగినవారు వారు ఎందరో ఉన్నారు.ఉదాహరణకు ఉప్పల్ బాలు, దుర్గా రావు, అగ్గిపెట్టి మచ్చ, ఆవేశం స్టార్ నరేష్.
ఇలాంటి వారెందరో ఈ యాప్ ద్వారా స్థిరపడ్డారు.
ఇకపోతే టిక్‌టాక్ యాప్ లో ఏదైనా ఒక వైరల్ అయ్యిందంటే దాని ప్రభావం కొన్ని వేల మందిపై వుంటుందనే విషయం చెప్పాల్సిన పనిలేదు.ఒక వీడియోను ఛాలెంజ్ గా తీసుకొని.అచ్చం అలాంటి వీడియోలను మరికొందరు సృష్టించే విధానం ఇక్కడినుండి వచ్చింది.ఈ ఫీచరే ప్రముఖ కార్ల కంపెనీలైన కియా, హ్యుందాయ్‌కి పక్కలో బల్లెంలాగా మారింది.అవును… ఓ స్క్రూడ్రైవర్, USB కేబుల్ ఉంటే చాలు.కారును సులువుగా దొంగిలించొచ్చంటూ కొందరు చేసిన వీడియోలు ఆ సంస్థలను నేడు కోలుకోలేని దెబ్బె కొడుతోంది.
ఇకపోతే గతేడాది అమెరికాకు చెందిన కొందరు వ్యక్తులు ‘కియా బాయ్స్’ పేరిట కియా, హ్యుందాయ్ కార్లే లక్ష్యంగా చేసుకుని కొన్ని వీడియోలు చేసారు.ఈ క్రమంలో తాళం అవసరం లేకుండా కార్లను ఎలా స్టార్ట్ చేయొచ్చో ఆ వీడియోల్లో ప్రాక్టికల్ గా చేసి చూపించారు.“మొదట స్క్రూడ్రైవర్ సాయంతో స్టీరింగ్ కింద ఉన్న ప్లాస్టిక్ బాక్సును తొలగించి.
USB కేబుల్ సాయంతో కార్లను స్టార్ట్ చేస్తున్నారు”.ఈ వీడియోలు వైరల్‌గా మారడంతో వందలాది యువకులు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి వందల్లో దొంగతనాలు చేయడం కొసమెరుపు.ఇంటి బయట, రోడ్డు పక్కన పార్క్ చేసిన కార్లని తాళం సాయం లేకుండా ఎత్తుకెళ్లడమే ఈ ఛాలెంజ్.ఈ క్రమంలో పోలీసులకు దొరక్కుండా తప్పించుకునే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదాలు, మరణాల బారిన పడినవారు కూడా వున్నారు.
దాంతో ఇది పెద్ద వివాదం అయిపోయింది కూడా.