షుగర్ లెవెల్స్ పెరగడంతో ఆ పని చేయలేని వైద్యులు.. తప్పు జరిగిందంటూ?

ప్రముఖ టాలీవుడ్ నటుడు తారకరత్నకు ప్రస్తుతం నారాయణ హృదయాలయలో చికిత్స జరుగుతున్న సంగతి తెలిసిందే.వైద్యులు రోజుకు రెండు లేదా మూడుసార్లు హెల్త్ బులెటిన్ల ద్వారా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అప్ డేట్లను ఇస్తున్నారు.

 Tarakaratna Health Issues Details Here Goes Viral In Social Media , Tollywood A-TeluguStop.com

తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గానే ఉంది.

తారకరత్నకు బెలూన్ యాంజియోప్లాస్టీ విధానం ద్వారా రక్తం పంపింగ్ జరిగేలా వైద్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బాలయ్య, చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు.కుప్పంలో జరిగిన పాదయాత్రలో పాల్గొనడానికి వెళ్లిన తారకరత్న అక్కడ కుప్పకూలిపోయారు.అయితే తారకరత్నకు షుగర్ ఎక్కువగా ఉండటంతో ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యాయని సమాచారం.

Telugu Sugar Levels, Sugar Tablets, Tarakaratna-Movie

తెలుస్తున్న సమాచారం ప్రకారం తారకరత్న గుండెలో బ్లాక్స్ ఎక్కువగా ఉన్నాయి.షుగర్ సాధారణ స్థితిలో ఉంటే మాత్రమే స్టంట్ వేయడం సాధ్యం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.గత కొన్నిరోజులుగా ఆయన షుగర్ ట్యాబ్లెట్స్ వాడటం లేదని ఫలితంగా ఆయన షుగర్ లెవెల్స్ 400కు చేరాయని సమాచారం.

తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Telugu Sugar Levels, Sugar Tablets, Tarakaratna-Movie

నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఏదో విషయాన్ని దాచేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తారకరత్న హెల్త్ విషయంలో ఫ్యాన్స్ లో ఒకింత కన్ఫ్యూజన్ అయితే నెలకొంది.షుగర్ ట్యాబ్లెట్స్ ను వాడి ఉంటే తారకరత్నకు ప్రస్తుతం ఈ ఆరోగ్య స్థితి వచ్చేది కాదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తారకరత్న పొలిటికల్ గా సక్సెస్ సాధించాలని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది.తారకరత్నకు నందమూరి ఫ్యాన్స్ లో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తారకరత్న ఎక్కడినుంచి పోటీ చేసినా ఎన్నికల్లో విజయం సాధించడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.తారకరత్న కోలుకున్నా కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube