బీహార్ రాజకీయాల్లో మరో ఏక్ నాథ్ షిండే..? నితీష్ కూటమి కూలినట్టేనా..?

బీహార్‌లో ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జేడీయూ అధినేత.అనంతరం సీఎం గా బాధ్యతలు స్వీకరించారు.అయితే ఎక్కడ తేడా కొట్టొందో తెలియదు కానీ.అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.ఏకంగా బీజేపీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.ఇలా రాజీనామా చేశారో లేదో అలా మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

 Another Ek Nath Shinde In Bihar Politics Is Nitish's Alliance Collapsing , Bihar-TeluguStop.com

కాకపోతే మారింది కేవలం మిత్రులు మాత్రమే.బీజేపీతో తెగదెంపులు చేసుకున్న ఆయన ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నారు.

అనంతరం అర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి.అధికారం చేజిక్కించుకున్నారు.ఇంత వరకూ బాగానే ఉంది.అయితే ఈ పొత్తు నితీష్ కుమార్ పార్టీ నేతలకు నచ్చడం లేదు.

దాంతో ఆ పార్టీలో ముసలం మొదలైనట్టు కనిపిస్తోంది.జేడీయూ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అయిన ఉపేంద్ర కుహ్వానా.

సాక్షాత్తూ.పార్టీ అధినేతపైనే విమర్శలు చేయడం మొదలు పెట్టారు.

అసలు ఆర్జేడీతో పొత్తు ఎందుకో చెప్పాలని నిలదీశారు.

Telugu Biharcm, Centralupedra, Upendra Kuhvana-Politics

మారోవైపు కుహ్వానా బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారనే వార్తలు ఊపందుకోవడంతో.నితీష్ కుమార్ అలెర్ట్ అయ్యారు.ఒక్క సారిగా ఆయన్ను పార్టీలో నుంచి వెళ్లిపోవాలని పరోక్షంగా చెప్పేశారు.

మహారాష్ట్రాలో ఒక ఏక్ నాథ్ షిండే, మధ్య ప్రదేశ్ లో ఒక జ్యోతిరాధిత్య సింధియా లాగా.బీహార్ లో కీలక నేత కోసం బీజేపీ వెతుకుతోంది.వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు.కుహ్వానా బీజేపీ కంట పడ్డాడు.

దాంతో బీజేపీ ఇప్పుడు కుహ్వానా నాయకత్వంలో కొందరు నేతల్ని చీల్చి పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Telugu Biharcm, Centralupedra, Upendra Kuhvana-Politics

కుహ్వానాను పార్టీకి రాజీనామా చేయాలని అధినేత నితీష్ కుమార్ ఆదేశించారు.దాంతో కుహ్వానా పార్టీలో తన వాటా ఇస్తే వెళ్లిపోతానని ప్రకటించారు.దాంతో ఆయన వాటా అంటే.

తన వర్గం ఎమ్మెల్యేలు కావచ్చని పుకార్లు మొదలయ్యాయి.ఒక వేళ తన వర్గం ఎమ్మెల్యేలతో ఆయన బీజేపీ గూటికి చేరితే.

నితీష్ పార్టీ పతనం అవడం ఖాయం అని విశ్లేషకులు చెబుతున్నారు.ఇప్పుడు బీహార్ మరో మహారాష్ట్రా కానుందా.? అనే పుకార్లు మొదలయ్యాయి.మరి బీజేపీ అనుకున్నంత పని చేస్తుందా.? లేక బీజేపీకి నితీష్ చెక్ పెడతారా చూడాలి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube