అయ్యా బాబోయి.... వెంకటేష్ ని కూడా చెడగొట్టేసారు కదా ?

వెంకటేష్ 75వ సినిమాగా సైంధవుడు గా తెలుగు ప్రేక్షకుల ముందుకి ఒక యాక్షన్ వీరుడు గా రాబోతున్నాడు.దానికి సంబంధించిన ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

 Venkatesh Also Entered Into Action Movies With Saindhav Movie Details, Venkatesh-TeluguStop.com

చివరికి వెంకటేష్ ని కూడా మిగతా హీరోల లిస్టులో కలిపేశారు.నిన్న మొన్నటి వరకు అద్భుతమైన, చిన్న బడ్జెట్ సినిమాలకు అలాగే వయసుకు తగ్గ పాత్రలకు పెట్టింది పేరుగా ఉన్న వెంకటేష్ ఆ జోనర్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ మిగతా సినిమా హీరో లాగానే కమర్షియల్ మరియు యాక్షన్ సినిమా తీయడానికి ముందుకు వచ్చాడు.

ఒక నారప్ప, దృశ్యం, ఎఫ్ 3 ఇవన్నీ కూడా వెంకటేష్ కి మంచి పేరు తీసుకొచ్చాయి.కానీ తన కన్నా చాలా చిన్న హీరోలు ఎడాపెడా ఫైట్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తూ బాక్సాఫీస్ కొల్లగొడుతున్నారు అని భయం పట్టుకుందో ఏమో మరి పైగా సీనియారిటీ అనే పేరు పెట్టి చివరికి తండ్రిని కాకుండా తాతను కూడా చేస్తారేమో అని అనుకున్నాడో కానీ మొత్తానికి గత కొన్ని రోజులుగా మిగతా సినిమాల హీరోలు ఏదైతే చేస్తున్నారో ప్రస్తుతం వెంకటేష్ కూడా అదే చేయబోతున్నాడు.

Telugu Drishyam, Venkatesh, Ppa, Saindhav-Movie

కేజిఎఫ్, వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, పఠాన్, ధమాకా, విక్రమ్… ఇలా ఈ సినిమాలన్నీ కూడా బీభత్సమైన యాక్షన్ సినిమాలు కావడంతో తాను అందరి దృష్టిలో లేకుండా పోతున్నాడు అని అనిపించింది కాబోలు స్టంట్ లు, ఫటాఫట్, ధనాధన్ అంటూ యాక్షన్ మొదలు పెట్టాడు వెంకటేష్.హీరో అంటే మాఫియా డాన్ తో పోరాటాలు చేయాలి లేదంటే ఆ హీరోకి ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండాలి మరీ కాదంటే తల్లి.

Telugu Drishyam, Venkatesh, Ppa, Saindhav-Movie

చెల్లి అంటూ కొన్ని ఎమోషన్స్ సీన్స్ ఉండాలి.ఇక హీరో అనగా అండర్ కవర్ కాప్, రా ఏజెంట్, దేశభక్తి అనే ఫీవర్ మసాలా పడాల్సిందే.చేతిలో ఎంతమందిని నరుకుతూ పోతూ ఉంటే అంత సక్సెస్.ఎంత మందిని తన మిషన్ గన్ తో కాల్చితే అంత ఎలివేషన్ అని భావిస్తున్న రోజులు ఉన్నాయి కాబట్టి వెంకటేష్ కూడా ఒక ప్రయోగంతో అలాగే ముందుకు రాబోతున్నాడు.

ఇంకేముంది చిన్నగా మౌత్ టాక్ వచ్చినా కూడా థియేటర్లో ఫుల్ కాసులు.సాటిలైట్ హక్కులు, డిజిటల్ రేట్లు … కోట్లకు కోట్లు కుమ్ముడే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube