ఆస్కార్ నామినేషన్ లిస్ట్ లో మూడు ఇండియన్ సినిమాలు.. ఆర్ఆర్ఆర్ తో పాటు?

టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గురించి మనందరికీ తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అయి రికార్డుల స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి రికార్డు మీద రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది.

 Two More Oscar Nominations Got To Indian Movies Along With Rrr Naatu Naatu Song-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే ఆస్కార్ బరిలో నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే.అయితే ఈ సారి ఆస్కార్ అవార్డులకు సంబంధించిన ఇండియన్‌ సినిమా చరిత్ర రికార్డు సృష్టించింది.

మూడు సినిమాలు ఆస్కార్‌ నామినేషన్లని సాధించాయి.కాగా ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నాటు నాటు పాటకిగానూ ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌కి నామినేట్‌ అయ్యింది.

Telugu Breathes, Indian, Naatu Naatu, Oscar-Movie

ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఇండియన్‌ సినిమాకి ఆస్కార్‌ నామినేషన్‌ దక్కడం ఇదే మొదటిసారి.ఆర్‌ఆర్‌ఆర్‌ తో పాటుగా మరో రెండు సినిమాలు కూడా ఆస్కార్‌కి నామినేట్‌ కావడం విశేషం.బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్‌ విస్పరర్స్, అలాగే డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్ విభాగంలో ఆల్‌ దట్‌ బ్రీత్స్ సినిమాలు ఆస్కార్‌ నామినేషన్లని సాధించాయి.ఇలా ఈసారి మూడు సినిమాలు చరిత్ర సృష్టించాయని చెప్పొచ్చు.

ఈ సినిమాకు కార్తికి గోంజేల్స్ దీనికి దర్శకత్వం వహించగా, అచిన్‌ చైన్‌తో కలిసి గునీత్‌ మోంగా ది ఎలిఫెంట్‌ విస్పరర్స్ డాక్యుమెంటరీని నిర్మించారు.అలాగే ఆల్‌ దట్ బ్రీత్స్ డాక్యుమెంటరీ సినిమాని షానక్‌ సేన్‌ దర్శకత్వం వహించారు.

Telugu Breathes, Indian, Naatu Naatu, Oscar-Movie

అయితే మరి ఈ మూడు సినిమాలలో ఏ సినిమా ఆస్కార్‌ని దక్కించుకుంటుంది? ఏది చరిత్ర సృష్టిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.మార్చి 12న ఈ విషయం తేలనుంది.95వ ఆస్కార్‌ అవార్డులను మార్చి 12న ప్రకటిస్తారు.ఇవేకాకుండా వీటితోపాటుగా కాంతార, ది కాశ్మీర్‌ ఫైల్స్, చెల్లో షో` సినిమాలు కూడా ఆస్కార్‌ కి షార్ట్ లిస్ట్ అయినప్పటికి అవి నామినేషన్లని దక్కించుకోలేక పోయాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube