ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అవ్వడంతో 'ఆర్‌ఆర్ఆర్' రీ రిలీజ్‌ ప్లాన్స్‌

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో మన ఆర్ ఆర్‌ ఆర్‌ యొక్క నాటు నాటు కు చోటు దక్కించుకోవడం తో దేశ వ్యాప్తం గా సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.రాజమౌళి యొక్క ఆనందానికి అవధులు లేవు.

 Rajamouli Planning For Rrr Movie Re Release In America  , Rrr Movie , Re Release-TeluguStop.com

రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో పాటు మొత్తం యూనిట్ సభ్యులంతా కూడా ఈ సమయం లో ఎంతో ఆనందంగా ఉన్నారు.ఇప్పటికే అమెరికా లో ఈ సినిమా ను థియేటర్ల ద్వారా విడుదల చేయడం జరిగింది.

అలాగే ఓటీపీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్ అయింది.ఇప్పుడు ఆస్కార్ కి నామినేట్ అవడం తో సినిమా కు మరింతగా పాపులారిటీ లభించడం జరిగింది, అందుకే అమెరికా లో మళ్ళీ సినిమా ను థియేటర్ల ద్వారా విడుదల చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Telugu Alia Bhatt, America, Keeravani, Naatu Naatu, Rajamouli, Ram Charan, Tolly

సాధారణం గా ఆస్కార్ కి నామినేట్ అయిన సినిమా లను అమెరికా లో మళ్ళీ విడుదల చేయడం జరుగుతుంది.అలాగే ఈ సినిమా ను కూడా విడుదల చేస్తే కచ్చితం గా మిలియన్ నుండి రెండు మిలియన్ల డాలర్ల వసూలను నమోదు చేసే అవకాశం ఉందని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాజమౌళి ఇప్పటికే ఆ ప్రయత్నం లో ఉన్నట్లు తెలుస్తోంది.ఆస్కార్‌ నామినేషన్స్‌ లో సినిమా ను ఉంచడం కోసం రాజమౌళి దాదాపుగా 50 కోట్ల రూపాయలను పబ్లిసిటీ కోసం ఖర్చు చేశాడట.

Telugu Alia Bhatt, America, Keeravani, Naatu Naatu, Rajamouli, Ram Charan, Tolly

ఇప్పుడు రీ రిలీజ్ చేయడం ద్వారా ఆ మొత్తంను రాబట్టే ప్రయత్నాలను జక్కన్న చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఒక వైపు సినిమా విడుదల వల్ల కలెక్షన్స్ రావడం తో పాటు మరో వైపు సినిమాకు పబ్లిసిటీ మరింత దక్కినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.రాజమౌళి సినిమా కు ఆస్కార్ నామినేషన్ దక్కడం దేశం గర్వించ దగ్గ విషయం అంటూ సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube