రూ.3 కోట్లకే ఆ ద్వీపం అమ్మేస్తున్న దేశం.. ఈ విషయాలు తెలిస్తే!

ఈ రోజుల్లో మామూలు సిటీలో ఒక డబుల్ బెడ్ రూమ్ కొనాలంటే కోటి రూపాయలు వెచ్చించక తప్పదు.ఇక ఎకరాల చొప్పున స్థలాలు కొనాలంటే చాలా డబ్బులు కుమ్మరించాల్సి ఉంటుంది.

 The Country Is Selling That Island For Rs. 3 Crores.. If You Know These Things!-TeluguStop.com

అయితే ఒక చోట ఏకంగా ఒక ద్వీపాన్ని, అందులోని పెద్ద భవంతిని కేవలం మూడు కోట్లకే అమ్మేస్తున్నారు.సెంట్రల్ అమెరికాలోని నికరాగ్వాలోని బ్లూఫీల్డ్ తీరానికి 19.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ది ఇగువానా (Iguana) ఐలాండ్ ఇప్పుడు రూ.3.76 కోట్లకు అమ్ముడవుతోంది.ఇగువానా అనేది ఒక అగ్నిపర్వత ద్వీపం.

ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపం చుట్టూ అరటి, కొబ్బరి చెట్లు ఉన్నాయి.

రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్ ప్రైవేట్ ఐలాండ్స్ ఇంక్ ప్రకారం, ఇగువానా ద్వీపంలో ట్రిపుల్-బెడ్ రూమ్ హౌజ్, రెండు బాత్‌రూమ్‌లు, డైనింగ్ రూమ్, బార్, లివింగ్ ఏరియాతో పాటు అదనపు వసతి సౌకర్యాలను ఉన్నాయి.దీనిని ఒక అమెరికన్ డెవలపర్ మోడర్న్ స్టాండర్డ్స్‌కి అనుగుణంగా నిర్మించాడు.దీనిని కొనుగోలు చేసేవారు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా నిర్మించుకోవచ్చు.

ద్వీపానికి పశ్చిమాన ఒక ఫిషింగ్ డాక్ కూడా ఉంది.ఇక్కడి నుంచి బయట ప్రపంచంతో కనెక్టివిటీని అందించడానికి Wi-Fi, ఫోన్, టీవీ సిగ్నల్స్ అందుబాటులో ఉన్నాయి.

క్లిస్టల్‌ క్లియర్ వాటర్, అద్భుతమైన సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, పగలు, రాత్రి పొద్దుపోయే సమయాల్లో వ్యూస్ ఇక్కడ అద్భుతంగా ఉంటాయని చెబుతున్నారు. ప్రైవేట్ ఐలాండ్స్ వెబ్‌సైట్ యజమాని దీనిని కొనుగోలు చేశాడు.కొన్ని కారణాలవల్ల దీనిని తక్కువ ధరకే అమ్మేస్తున్నాడు.ఒక సపరేటు ప్రపంచంలో రాజులా ప్రశాంతంగా బతకాలనుకునే వారికి ఈ ఐలాండ్ బాగా సూట్ అవుతుందని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube