నెల్లూరు జిల్లా పోలీసులపై మాజీ మంత్రి సోమిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రజలను రక్షించాల్సిన పోలీసులు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారన్నారు.
వెంకటాచలంలో టీడీపీలో చేరుతున్న వారిని పోలీసులు హెచ్చరించారని తెలిపారు.తమ పార్టీలో చేరుతున్న వారిని పిచ్చి కుక్కల్లా కొట్టారని ఆరోపించారు.
వైసీపీలో చేరుతుంటే కాపలా కుక్కల్లా ఉన్నారని విమర్శించారు.పోలీసుల తీరు చూస్తుంటే మంత్రి కాకాణి వారికి జీతాలిస్తున్నట్లుందని ఎద్దేవా చేశారు.
తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.పోలీసులకు వీరసింహారెడ్డి సినిమా చూపిస్తానన్న ఆయన పోలీసుల ఘటనలపై త్వరలో ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తానని వెల్లడించారు.