జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.పవన్‌ది పక్కా ప్యాకేజీ రాజకీయమని చెప్పారు.
పవన్‌ది ఆరాటం తప్ప పోరాటం కాదని విమర్శించారు.పవన్ కల్యాణ్ మాటలకు అర్ధాలే వేరులే అని ఎద్దేవా చేశారు.
గ్యారెంటీ ఇస్తే సింగిల్ గా పోటీ చేస్తారంట.ఎవరిస్తారు గ్యారంటీ కార్డు అని ప్రశ్నించారు.
చంద్రబాబు ఇస్తారా.? లేదా జనసైనికులు ఇస్తారా గ్యారెంటీ అని నిలదీశారు.ఇప్పటివరకు ప్రజల కోసం పవన్ చేసిన పోరాటం ఏంటో చెప్పాలన్నారు.ఒక్క డైలాగ్ కొడితే పోరాటం అయిపోదని స్పష్టం చేశారు.