ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఈ రెండు సినిమా లతో పాటు దిల్ రాజు నిర్మించిన తమిళ మరియు తెలుగు సినిమా వారసుడు కూడా విడుదల కాబోతుంది.
తన వారసుడు సినిమాకు సాధ్యం అయినన్ని ఎక్కువ థియేటర్లు తీసుకున్న తర్వాత మాత్రమే తాను ఇతర సినిమాలకు థియేటర్లు ఇస్తాను అంటూ ప్రకటించాడు.తన సినిమా కు థియేటర్లు లేకుండా ఇతర హీరోల సినిమాలకు థియేటర్లు ఇచ్చేంత మంచి మనసు నాది కాదు అన్నట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
అధికారికంగా ఆయన వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమాలకు ఎక్కువ థియేటర్ లు ఇవ్వబోవడం లేదు అన్నట్లుగా ప్రకటించాడు.భారీ ఎత్తున అంచనాలున్న ఆ రెండు సినిమాలను కాదని తక్కువ క్రేజ్ ఉన్న వారసుడు సినిమా కు ఎక్కువ థియేటర్లు ఇవ్వాలని దిల్ రాజు నిర్ణయించుకున్నాడు.
ఈ సమయంలోనే వారసుడు సినిమా తో పాటు ఇదే సంక్రాంతికి తమిళంలో విడుదల అవ్వబోతున్న తునివ్వు సినిమా ను తెలుగు లో తెగింపు అంటూ విడుదల చేయబోతున్నాడు.అజిత్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం హించాడు.
వీరిద్దరిది హిట్ కాంబో.తమిళనాట వంద కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేయడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.ఈ సమయంలో ఆ సినిమా ను కూడా తెలుగు లో దిల్ రాజు విడుదల చేస్తాను అంటూ రైట్స్ ను కొనుగోలు చేయడం తో అంతా కూడా షాక్ అవుతున్నారు.ఇదేం ట్విస్ట్ ఇప్పటికే వారసుడు సినిమా తో ఆ రెండు సినిమా లకు ఎసరు పెట్టినట్లుగా ఉంటే ఇప్పుడు మరో సినిమా ను తీసుకు వస్తే చిరు బాలయ్యల సినిమాలకు థియేటర్ల పరిస్థితి ఏంటీ అంటూ కొందరు దిల్ రాజును ప్రశ్నిస్తున్నారు.
మరి రాజు గారి సమాధానం ఏంటో చూడాలి.