ఈ రోజుల్లో మోమోస్ గురించి దాదాపు అందరికీ తెలుసు.కూరగాయలు, మాంసంతో నిండిన ఈ చిరుతిండి చాలామందికి ఎంతో ఇష్టమైన ఆహారం.
ఈ రోజుల్లో ఈ ఆవిరి స్నాక్స్‌లో చాలా రకాలు అందుబాటులోకి వచ్చాయి.రోజురోజుకు దీనిలో వెరైటీలు రావడం పెరుగుతోంది.
ఇందులో ఫ్రైడ్ మోమోస్ నుండి చీజ్ మోమోస్ వరకు అందుబాటులో ఉంటాయి. స్పైసీ చట్నీతో వాటి అద్భుతమైన రుచి గురించి ఆలోచిస్తే చాలు.
ఎవరికైనా నోరు ఊరుతుంది.అయితే మోమోస్ అనే ఈ చిరుతిండి ఇండియాకి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
మోమోస్ ఎక్కడ నుండి వచ్చాయి?
మోమోస్ చరిత్ర చాలా పురాతనమైది.ఇవి అనేక దేశాలను దాటి భారతదేశానికి చేరుకున్నాయి.
మోమోస్ మొట్టమొదట 14వ శతాబ్దంలో తయారయ్యాయి.టిబెట్ మరియు నేపాల్ రెండూ వీటి జన్మస్థలంగా పరిగణిస్తుంటారు.
ఎందుకంటే ఈ రెండు దేశాలు మోమోస్ తమ సొంతమని చెప్పుకుంటున్నాయి.ఇండియాకి వచ్చేసరికి ఇది ఇక్కడి రుచికి తగ్గట్టుగా తయారైంది.1960లలో పెద్ద సంఖ్యలో టిబెటన్లు భారతదేశానికి తరలి వచ్చి లడఖ్, డార్జిలింగ్, ధర్మశాల, సిక్కిం, ఢిల్లీ వంటి ప్రాంతాలలో స్థిరపడ్డారని చరిత్ర చెబుతోంది.మోమోస్ ఇష్టపడే వ్యక్తులు ఈ ప్రదేశాలలో అధికంగా కనిపిస్తారు.
మోమోస్‌లో అత్యంత వైవిధ్యం కూడాఈ ప్రదేశాలలో చూడవచ్చు.మోమోస్ భారతదేశానికి రావడం గురించి మరొక కథనం ఉంది.
ఖాట్మండు నుండి ఒక దుకాణదారుడు భారతదేశానికి వచ్చాడని, అతను ఈ టిబెటన్ వంటకం అతనితో పాటు భారతదేశానికి తీసుకువచ్చాడని చెబుతారు.
భారతదేశంలో కొత్త రుచి మొదల్లో మాంసంతో నింపి మోమోలను తయారు చేసేవారు అందులో ముఖ్యంగా యాక్ మాంసాన్ని ఉపయోగించేవారు.కానీ, టిబెట్ పర్వతాల నుండి దిగి, ఉత్తర భారతదేశం వైపు ఈ చిరుతిండి వచ్చినప్పుడు, రుచికి అనుగుణంగా కూరగాయలను కూడా నింపి తయారుచేయడం ప్రారంభించారు.అది ఏ వంటకమైనా సరే భారతదేశంలోకి రాగానే అది ఇక్కడి శైలిని పొంది, కొత్త రుచిని సంతరించుకుంటుంది.
మోమోస్ విషయంలో కూడా అలాగే జరిగింది.భారతదేశంలోని వీధులు మొదలుకని ఫైవ్ స్టార్ హోటళ్ల వరకు, స్పైసీ చికెన్ మీట్, పనీర్, కూరగాయలు, చీజ్, పోర్క్, సీఫుడ్‌లతో కూడిన అనేక రకాల మోమోలు అందుబాటులో దొరుకుతుంటాయి.