అప్పుడు వైఎస్, ఇప్పుడు రేవంత్... అదే తప్పు చేస్తున్న కాంగ్రెస్?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల నుండి అధిష్టానం వైపుకు వస్తున్న అసంతృప్తి గురించి తెలిసిందే.గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాలలో ఇదే కీలకమైన చర్చ.

 Congress Giving Revanth Priority Is A Mistake , Digvijaya Singh , Jagga Reddy ,-TeluguStop.com

ఇక రేవంత్ రెడ్డి వర్సెస్ ఇతర కాంగ్రెస్ నాయకుల వివాదాన్ని చెక్కబెట్టేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ కు వచ్చారు.ఇలా మధ్యవర్తిత్వానికి హై కమాండ్ ఒక దూతను పంపిస్తే కాంగ్రెస్ నాయకులు బెట్టు చేయడం ఖాయం.

రేవంత్ రెడ్డిని పిసిసి చీఫ్ గా తప్పించాలని వారి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈ విషయంపై హై కమాండ్ ఏ మాత్రం పట్టించుకోవట్లేదు అన్నది లోపలి గుట్టు.అయితే కాంగ్రెస్ హై కమాండ్ ఇలా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు.

గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి చెప్పిందే జరిగేది.కేంద్రం కి రాష్ట్రంపై పెద్దగా పట్టు ఉండేది కాదు.

టికెట్లు ఎవరికి ఇవ్వాలి, మొత్తం పార్టీ కార్యకలాపాలు రాష్ట్రంలో ఎలా జరగాలి… అన్న విషయాలపై పూర్తి నిర్ణయాలు రాజశేఖర్ రెడ్డి తీసుకునేవాడు.సోనియా గాంధీ ఇతర ఢిల్లీ పెద్దలకు అస్సలు అవకాశం ఉండేది కాదు.

చివరికి చూస్తే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత పార్టీ కుదేలు అయింది.ప్రతి ఒక్కరూ రాజశేఖర్ రెడ్డికి లోబడి పని చేశారే తప్పించి ఒక్కరిలో కూడా నాయకత్వ లక్షణాలు లేకుండా పోగా ప్రజల్లో అంత పాపులారిటీ సంపాదించుకునే అవకాశం కూడా లేదు.

ఇక ఏపీలో కాంగ్రెస్ కనుమరుగు అయ్యింది.

Telugu Congress, Digvijaya Singh, Jagga Reddy, Komativenkat, Revanth Reddy-Polit

ఇప్పుడు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఇదే ప్రాముఖ్యత గనుక ఇస్తే భవిష్యత్తులో పార్టీ కేడర్ చెల్లాచెదురు కావడం ఖాయం అన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఇక దిగ్విజయ్ సింగ్ పలువురు సీనియర్లకు ఫోన్ చేసి తొందర పడవద్దు అని చెప్పారు.అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలోనే ఆయనను కలిసి తన వాదన వినిపించాడట.

కానీ రేవంత్ కి వ్యతిరేకంగా సీనియర్లు చేసే వాదన ను హైకమాండ్ పెద్దగా పట్టించుకోకపోవచ్చు అన్నది సమాచారం.సర్దుబాటు చేసి వెళ్లిపోయేలా ఉంటే అంత దూరం నుండి దిగ్విజయ్ రావడం ఎందుకు? ఒక్క నాయకుడు కోసం మిగిలిన పార్టీ పెద్దలందరిని బాధ పెట్టాలా అన్న విషయాన్ని సోనియా, రాహుల్ ఆలోచించుకోవాల్సిందే.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube