రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్దమవుతున్నారు.ఏపీ అంతటా బస్సు యాత్ర చేయనున్న పవన్ దాని కోసం ప్రత్యేకంగా రూపొందించిన మిలటరీ బస్సులా కనిపించే వాహనాన్ని కొనుగోలు చేశారు. “వారాహి”గా ఈ వాహనానికి నామకరణ్ చేశారు. ప్రసుత్తం ఈ వాహనానికి సంబంధించిన పేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వాహనం రంగుపై వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు ఇప్పటికే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆలివ్ గ్రీన్ కలర్‌లో ఉన్న వాహనాన్ని ఉపయోగించడం సరికాదని, ఎందుకంటే ఆ రంగు కేవలం భారత సైన్యం కోసం మాత్రమే ఉద్దేశించబడింది.
దీనిపై జనసేన సభ్యులు స్పందిస్తూ.జగన్, ఏపీ సీఎం పీకే అంటే భయపడుతున్నారన్నారు. దీనికి ప్రతీకారంగా ఏపీ పర్యాటక, సాంస్కృతిక, యువజన వ్యవహారాల శాఖ మంత్రి ఆర్కే రోజా పీకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇది వారాహినా లేక నరహీనా?” అని రోజా పీకేపైనా, ఏపీ మాజీ సీఎం నారా చంద్ర బాబు నాయుడుపైనా నేరుగా విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ చంద్ర బాబు నాయుడు, ఆయన పార్టీ టీడీపీ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఆమె అన్నారు.2019 ఎన్నికల్లో జనసేన ఓటమి తర్వాత జనసేన, టీడీపీ మధ్య పొత్తు ముగిసింది. పవన్ కళ్యాణ్ ఎవరిపై పోరాడుతున్నారో క్లారిటీ లేదని రోజా అన్నారు.“హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న పవన్‌కల్యాణ్‌కి ఊపిరి పీల్చుకోవడానికి కూడా కేటీఆర్, కేసీఆర్‌ల అనుమతి కావాలి”,
“సీబీఎన్ తన పాల కంపెనీ హెరిటేజ్ కోసం హైదరాబాద్‌లో 15 వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టాడు” అంటూ రోజా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని ఏపీలోని దుష్ట రాజకీయ నాయకులందరినీ హైదరాబాద్‌కు తరిమికొట్టాలని వైఎస్సార్‌సీపీ ప్రయత్నిస్తున్నట్లుగా రోజా వ్యాఖ్యలు ఉన్నాయి.అయితే ఇనాళ్ళు కాస్త సైలెంట్‌గా రోజా ఇప్పుడు తాజా విమర్శలతో మళ్ళి లైమ్‌లైట్ లోకి వచ్చారు.
ప్రతిపక్షాల విమర్శలకు వైసీపీ నుండి కౌంటర్ ఇవ్వడం నేతల విఫలమవుతున్నారనే నేపథ్యంలో రోజా ఇలా పవన్‌పై విరుచుకపడినట్లు తెలుస్తుంది. ఇక పవన్‌ను విమర్శించే బాధ్యతు వైసీపీ రోజాకు అప్పగించనట్లు తెలుస్తుంది.