సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఎదురు చూడని ఫ్యాన్స్ లేరు.ఈయన ఇటీవలే సర్కారు వారి పాట వంటి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.
ఇక ఈ విజయం తర్వాత మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.త్రివిక్రమ్ కూడా మంచి ఫామ్ లో ఉండడంతో ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
ఈ కాంబో ఇప్పటికే రెండు సార్లు కలిసి సినిమాలు చేసారు.అతడు, ఖలేజా వంటి రెండు సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి.
రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ సాధించాయి.ఇప్పుడు మూడవ సినిమా రాబోతుంది.”SSMB28” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.
ప్రెజెంట్ రెండవ షెడ్యూల్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.
పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ బయటకు వచ్చింది.
టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మొత్తం మూడు భారీ సెట్టింగ్స్ రెడీ చేస్తున్నారట.
అంతేకాదు ఈ సినిమాలో ఒక ప్రముఖ సీనియర్ స్టార్ నటి కీలక రోల్ లో చేయనున్నారని.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా త్రివిక్రమ్ కథను రెడీ చేసినట్టు తెలుస్తుంది.మరి మహేష్ బాబు రెడీ అయితే సెట్స్ మీదకు వెళ్లడమే ఆలస్యం అని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.