Telangana government: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..!!

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్.విషయంలోకి వెళ్తే ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంసెట్ శిక్షణ కోసం చాలామంది ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు.

 Telangana Government Gave Good News To Inter Students Telangana Government, Tela-TeluguStop.com

ఈ క్రమంలో విద్యార్దుల తల్లిదండ్రులు  వేలకు వేలు ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.అయితే ఇప్పుడు ఇంటర్ చివరి సంవత్సరం  చదివే విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని.

తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది.

దీంతో ప్రస్తుతం ఇంటర్ సిలబస్ డిసెంబర్ లో పూర్తి చేసి జనవరి మరియు ఫిబ్రవరి మాసాలలో కళాశాలలోనే ఎంసెట్ శిక్షణ ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలంగాణ కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ తెలియజేయడం జరిగింది.

అంతేకాదు ఈ శిక్షణలో మెరిట్ విద్యార్థులను గుర్తించడానికి పరీక్షలు కూడా నిర్వహించనున్నారట.అనంతరం మెరిట్ బట్టి ప్రతి జిల్లాలో 50 మంది అమ్మాయిలు మరియు 50 మంది అబ్బాయిలను ఎంపిక చేయనున్నట్లు.

స్పష్టం చేశారు.ఆ తర్వాత మార్చిలో వార్షిక పరీక్షలు ముగిసిన అనంతరం ఏప్రిల్ మరియు మే నెలలో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ సదరు మెరిట్ విద్యార్థులకు ఇవ్వనున్నారట.

వీరికి ప్రత్యేకంగా మెటీరియల్ కూడా అందిస్తున్నట్లు తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube