Hero Nani: ఆ హీరోలతో పోలిస్తే నాని నిర్మాతగా సక్సెస్ కొట్టినట్టేనా?

ఎప్పుడు బిజీగా ఉండే హీరోల్లో న్యాచురల్ స్టార్ నాని ఒకరు.ఈయన ఏడాది పొడవునా వరుస సినిమాలు చేస్తూనే ఉంటాడు.

 Nani Be A Hit As A Producer Compared To Another Heroes Details, Dasara, Director-TeluguStop.com

వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ మినిమమ్ గ్యారెంటీ హిట్స్ అందుకున్న నాని శ్యామ్ సింగరాయ్ వంటి హిట్ తర్వాత అంటే సుందరానికి సినిమాతో ప్లాప్ ఎదుర్కున్నాడు.ఇక ప్రెజెంట్ నాని దసరా సినిమా చేస్తున్నాడు.

శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈయనకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.

గోదావరి ఖని లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ రూపొందిస్తున్నారు.

ఇక ఈ సినిమా 2023 మార్చి 30న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఇదిలా ఉండగా ప్రెజెంట్ నాని తన సినిమాలో నటిస్తూ బిజీగా ఉంటూనే ఇటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

వాల్ పోస్టర్ అనే బ్యానర్ స్థాపించిన నాని.ఈ బ్యానర్ లో చిన్న చిన్న సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

తాజాగా ఈ బ్యానర్ పై అడవి శేష్ నటించిన హిట్ 2 సినిమాను నిర్మించారు.

Telugu Dasara, Srikanth Odela, Keerthy Suresh, Nani, Wall Poster-Movie

ఈ సినిమా డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ అందుకుంది.ఈ సినిమా హిట్ అందుకోవడంతో ఇప్పుడు నాని నిర్మాతగా సక్సెస్ అయినట్టే అని అంటున్నారు.

హిట్ ఫ్రాంచైజీ ఆశించిన విజయాలు అందుకోవడంతో నాని కమర్షియల్ ప్రొడ్యూసర్ గా విజయం సాధించినట్టే అని చెబుతున్నారు.

మిగతా హీరోలతో పోలిస్తే నాని ప్రొడ్యూసర్ గా హిట్ అయినట్టే అని చెబుతున్నారు.ఎందుకంటే ఇప్పటికే హీరోలు కొంతమంది నిర్మాతలుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు.

అయితే వారి కంటే నాని ఇప్పుడు నిర్మాతగా ముందు వరుసలో ఉన్నాడు అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube