Pawan Kalyan Movies: ఆ సినిమాలను పక్కనపెట్టి కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న పవన్.. ఆందోళనలో డైరెక్టర్స్?

హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం గబ్బర్ సింగ్. అయితే మీ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.

 Pawan Kalyan Announced A New Movie With Sujeeth Then What About Bhavadeeyudu Bha-TeluguStop.com

అయితే గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత శంకర్ తన నెక్ట్స్ సినిమాను పవన్ తోనే అనౌన్స్ చేశారు.అయితే అంతకు ముందు నుంచే పవన్ కళ్యాణ్ కోసం హరీష్ శంకర్ ఎదురుచూస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు మరొకవైపు పొలిటికల్లో బిజీ బిజీగా ఉండడం వల్ల ఆలస్యం అయ్యింది.

ఇక ఇప్పటికే ఎప్పుడో విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే.

అయితే ఈ భగవదీయుడు భగత్ సింగ్ సినిమా ఇంకా షూటింగ్ కూడా మొదలుకాకముందే తాజాగా పవన్ కళ్యాణ్ మరో యంగ్ డైరెక్టర్ సుజీత్ తో సినిమాను ప్రకటించారు.కాగా ఆ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్నారు.

అయితే, హరిహర వీరమల్లు తర్వాత వెంటనే భగవదీయుడు భగత్ సింగ్ నుంచి అప్డేట్ వస్తుందని అనుకుంటున్న క్రమంలో ఇలా సుజీత్ తో కొత్త సినిమాను ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.దీంతో హరీశ్ శంకర్ సినిమా ఇప్పట్లో మొదలు కాదేమో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Telugu Sujith, Harihara, Harish Shankar, Pawan Kalyan, Tollywood-Movie

కాగా గతంలో పవన్ ఒక ఈవెంట్ లో హరీశ్ తో సినిమా పక్కాగా ఉంటుందని చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి మూమెంట్ కనిపించడం లేదు.ఇది ఇలా ఉంటే తాజాగా భగవదీయుడు భగత్ సింగ్ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త తెగ వైరల్ అవుతోంది.అదేమిటంటే ఇప్పటికే కథను సిద్ధం చేయగా ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా కథలో మార్పులు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా ఈ నెలలోనే రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా తర్వాత భగవదీయుడు భగత్ సింగ్ సినిమాలో నటిస్తారా లేదంటే తాజాగా ప్రకటించిన సినిమాలో నటిస్తారా అన్నది చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube