Nara Lokesh YS Jagan : అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో వైసీపీ ప్రభుత్వం పై నారా లోకేష్ సీరియస్..!!

అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో వేటు వేయటానికి వైసీపీ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు రావడం తెలిసిందే.ఓ ప్రముఖ పత్రికలో పదేళ్ల లోపు సర్వీస్ కలిగిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను ఇంటికి పంపించేయడానికి.ప్రభుత్వం రహస్య ఆదేశాలు ఇచ్చినట్లు వచ్చిన కథనంపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో మండిపడ్డారు.

 Nara Lokesh Is Serious About Ycp Government Regarding Outsourcing Employees, Nar-TeluguStop.com

“తమను రెగ్యులర్ చేస్తారని, సమాన పనికి సమాన వేతనం ఇస్తారని ఎదురుచూస్తున్న రెండున్నర లక్షలకు మందికి పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉపాధిపైనే వేటు వేస్తున్నారు జగన్ రెడ్డి. పదేళ్లలోపు సర్వీసు వున్నవారందరినీ ఇంటికి సాగనంపుతున్న జగన్ రెడ్డీ నిన్ను ఎందుకు నమ్మాలయ్యా జనం.ప్రతీ ఏటా జనవరి 1నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ ఏళ్ళు గడుస్తున్నా ఒక్క జాబ్ క్యాలెండరూ ఇవ్వలేదు.వారంలో రద్దు చేస్తానన్న సీపీఎస్ 150 వారాలైనా రద్దు చేయనట్టే అవుట్ సోర్సింగ్ వాళ్లకి ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ గాలికి ఎగిరిపోయింది”.అంటూ నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై సీరియస్ పోస్ట్ పెట్టడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube