Kalyan ram balakrishna : హిట్టు కొట్టినా కళ్యాణ్ రామ్ ను వదలని కష్టాలు.. బాలయ్య సమస్యే అంటూ?

కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ గురించి చర్చించాలంటే బింబిసార మూవీకి ముందు ఆ సినిమాకు తర్వాత అని చర్చించుకోవాలి.కేవలం 10 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన బింబిసార సినిమా 40 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.

 New Problems For  Kalyan Ram Cine Career  Details Here Goes Viral   Kalyan Ram,-TeluguStop.com

అయితే ఈ సినిమా సక్సెస్ సాధించినా కళ్యాణ్ రామ్ కు కష్టాలు మాత్రం తీరలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్ట్ కు హీరోయిన్ దొరకడం లేదని తెలుస్తోంది.

కళ్యాణ్ రామ్ సినిమాకు ఇలాంటి వింత కష్టం వచ్చిందని తెలిసి ఫ్యాన్స్ సైతం షాకవుతున్నారు.కళ్యాణ్ రామ్ కు జోడీగా కొత్త హీరోయిన్ ను ఎంపిక చేస్తారా? లేక ఒకటి రెండు సినిమాలలో నటించిన హీరోయిన్ ను ఎంపిక చేస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.బాలయ్యకు కూడా పలు సందర్భాల్లో హీరోయిన్ల సమస్య ఎదురైందనే సంగతి తెలిసిందే.బాబాయ్ కు వచ్చిన సమస్యే ప్రస్తుతం అబ్బాయిని కూడా వేధిస్తోంది.

Telugu Balakrishna, Bimbisara, Kalyan Ram, Multirer, Tollywood-Movie

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం సొంత బ్యానర్ల కంటే బయటి బ్యానర్లలో ఎక్కువగా నటించడానీకి ఆసక్తి చూపిస్తున్నారు.బయటి బ్యానర్లలో కళ్యాణ్ రామ్ కు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ దక్కుతోందని సమాచారం అందుతోంది.కళ్యాణ్ రామ్ ప్రస్తుతం 8 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కళ్యాణ్ రామ్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించడంతో పాటు ఆ ప్రాజెక్టులు తన నమ్మకాన్ని నిలబెడతాయని కళ్యాణ్ రామ్ అనుకుంటున్నారు.కళ్యాణ్ రామ్ వేగంగా సినిమాల్లో నటించడం కంటే మంచి సినిమాలలో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

కళ్యాణ్ రామ్ తారక్ కాంబోలో మల్టీస్టారర్ తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube